వచ్చే విద్యాసంవత్సరం నుంచి దసరా, బతుకమ్మ పండగ0. సెలవులు పెరగనున్నాయి. సమైక్య పాలనలో తెలంగాణ పండుగలను నిర్లక్ష్యం చేశారని, సెలవుల్లోనూ సమ...
వచ్చే విద్యాసంవత్సరం నుంచి దసరా, బతుకమ్మ పండగ0. సెలవులు పెరగనున్నాయి. సమైక్య పాలనలో తెలంగాణ పండుగలను నిర్లక్ష్యం చేశారని, సెలవుల్లోనూ సమైక్య పాలకులు వివక్ష చూపించారని సీఎం కేసీఆర్ అధికారులతో అన్నారు. బతుకమ్మ పండుగ గురించి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… వచ్చే ఏడాది నుంచి దసరా, బతుకమ్మ పండుగలకు 15 రోజుల పాటు సెలవు ఇచ్చేలా విద్యా కేలెండర్ ప్రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పండుగలకు సరిపడా సెలవులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సీఎం చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే సంక్రాంతి సెలవులను రెండ్రోజులకు కుదించి కేలెండర్ తయారు చేయాలన్నారు సీఎం కేసీఆర్.