కోల్ బ్లాక్ ల కేటాయింపులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోల్ బ్లాక్ ల కేటాయింపులు సరికాదని… ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని విమర్...
కోల్ బ్లాక్ ల కేటాయింపులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోల్ బ్లాక్ ల కేటాయింపులు సరికాదని… ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని విమర్శించింది. 1993 తర్వాత కేటాయించిన కోల్ బ్లాక్ ల లైసెన్సులను రద్దు చేసింది. 2010 వరకూ జరిగిన అన్ని కేటాయింపులను క్యాన్సిల్ చేసింది. కోల్ బ్లాక్ లపై సీబీఐ ఎంక్వైరీ కంటిన్యూ అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఆధ్వర్యంలో నడిచే 4 కోల్ బ్లాక్ లను మినహాయిస్తూ తీర్పు ఇచ్చింది. రద్దు చేసిన 214 కోల్ బ్లాక్ లను తిరిగి వేలం వేసుకొనే అవకాశాన్ని కల్పించింది. కోల్ బ్లాక్ ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న కాగ్ నివేదికను సుప్రీం కోర్టు సమర్ధించింది. కోల్ బ్లాక్ ల కేటాయింపులో లక్షా 86 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ చెప్తోంది.