హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల దృష్ట్యా రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్-గో...
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల దృష్ట్యా రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్-గోండియాల మధ్య 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు. ఈనెల 24 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడువనున్నాయి. ప్రతీ బుధ, శని, సోమవారాల్లో సికింద్రాబాద్ నుంచి గోండియాకు ఉదయం 6.15 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. 23 నుంచి అక్టోబర్ 24 వరకు గోండియా-సికింద్రాబాద్ మధ్య మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఈ రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూరు-కాగజ్‌నగర్ మీదుగా ప్రయాణిస్తాయి.