బూచమ్మ బూచోడు సినిమా విషయంలో తనకు సక్సెస్ క్రెడిట్ దక్కకుండాహీరోశివాజీఅడ్డుపడుతున్నాడని చిత్ర దర్శకుడురేవన్యాదుఆరోపించారు.ప్రచారకార్యక్రమ...

బూచమ్మ బూచోడు సినిమా విషయంలో తనకు సక్సెస్ క్రెడిట్ దక్కకుండాహీరోశివాజీఅడ్డుపడుతున్నాడని చిత్ర దర్శకుడురేవన్యాదుఆరోపించారు.ప్రచారకార్యక్రమాల్లో సినిమాను తానే తీశానని శివాజీ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవన్ యాదు మాట్లాడుతూ ఈ సినిమా కోసం 18 నెలల పాటు తీవ్రంగా శ్రమించాను.విడుదలై హిట్‌టాక్ రాగానే చిత్రాన్ని తానే తీశానని శివాజీ ప్రచారం చేసుకుంటున్నాడు. ఛానళ్లలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు నేను రాకుండా అడ్డుపడుతున్నాడు. బూచమ్మ బూచోడు చిత్రానికి దర్శకుడిని నేనే అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.
శివాజీ ఓ మానసిక రోగిలా ప్రవర్తిస్తూ నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సినిమా విజయం ఏ ఒక్కరి సొంతం కాదు. దర్శకుడి పర్యవేక్షణలో టీమ్ అంతా సమిష్టి కృషి చేస్తేనే సినిమా నిర్మాణం సాధ్యమవుతుంది. శివాజీ గత చిత్రాలకు ఓపెనింగ్స్ కూడా లేవు. ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యేసరికి క్రెడిట్ అంతా తనదే అనడం హాస్యాస్పదంగా వుంది. నేను 12ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో వున్నాను. నా ప్రతిభ ఏమిటో ఎవరిని అడిగినా చెబుతారు అన్నారు.