దసరా పండగకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జి.జయరావు తెలిపారు. గురువారం మహాత్మగా...
దసరా పండగకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జి.జయరావు తెలిపారు. గురువారం మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం దసరా, బక్రీద్ వరుసగా వస్తున్నందున రెండింటికి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలోని 23 జిల్లాలకు రెగ్యులర్‌గా నిర్వహిచే బస్సులు కాకుండా ప్రత్యేకంగా 3335 బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. పండగ కోసం గ్రామాలకు తరలి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జంట నగరాల శివారు ప్రాంతాలలో నివసించే వారికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వారికి సమీప ప్రాంతాలలోని టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా కౌంటర్లు ప్రారంభించడమే కాకుండా ఆయా ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 26వ తేదీ నుంచి 2 వరకు మహాత్మగాంధీ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యార్థం తగినన్ని అదనపు విచారణ కేంద్రాలను ఎంజీబీఎస్‌లో, సీబీఎస్‌లో ఏర్పాటు చేశామని ఈడీ జి.జయరావు తెలిపారు. ఎంజీబీఎస్, సీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ , ఎల్‌బీనగర్ మొదలగు బస్‌స్టేషన్లలో 15 మంది సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, 80 మంది సెక్యూరిటీ గార్డులను నియమించడంతో పాటు పోలీసు సహాకారం తీసుకుని ట్రాఫిక్ సజావుగా సాగడానికి కృషి చేస్తామన్నారు. పండగ సందర్భంగా బస్‌స్టేషన్లతో పాటు నగరంలో 268 మంది ఆధీకృత ఏజెంట్ల ద్వారా, ఈ బుకింగ్ ద్వారా టికెటు రిజర్వ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేక బస్సుల పర్యవేక్షణ కోసం ముగ్గురు రీజియన్ స్థాయి అధికారులు, 20 మంది డివిజన్ స్థాయి అధికారులు, 55 మంది డిపో మేనేజర్లు, 175 మంది సూపర్ వైజర్లు పని చేస్తారని ఆయన తెలిపారు.
ఈనెల 29 నుంచి 2 వరకు ఎక్కువ రద్దీ ఉంటుందని ఆయా రోజుల్లో బస్ సర్వీసులు నగర శివారు ప్రాంతాల నుంచి నడుస్తాయని తెలిపారు. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్, జనగాం, నర్సంపేట, పరకాల, యాదగిరిగుట్ట ప్రాంతాల బస్సులు వెళతాయని తెలిపారు. జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి నల్లగొండ, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, బస్సులు, పాత సీబీఎస్ హేంగర్‌నుంచి కర్నూల్, కడప, చిత్తూర్, అనంతపూర్, నెల్లూర్, ఓంగోలు జిల్లాల బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి మిగత కోస్తా జిల్లాలకు వెళ్లె బస్సులు నడుస్తాయని తెలిపారు. ఇవి కాకుండా ఏటీబీ ఏజెంట్లు ఉన్న ఈసీఐఎల్, నాగారం, ఏఎస్‌రావు నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, చింతల్, చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, మెహిదీపట్నం, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల నుంచి రిజర్వేషన్ చేసుకున్న వారికి ఆయా ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయని తెలిపారు.
ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు ఎక్కువ వసూలు చేయడం జరుగుతుందని అన్నారు.
స్పెషల్ బస్సుల ద్వారా ఆదాయం రాదని కేవలం ప్రజల సేవ కోసమే ర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చివరి నిమిషంలో హడావిడి చేయకుండా ముందుగానే రిజర్వేషన్లు చేసుకొని తమ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఇతర సేవలకు ఏటీఎం (కోఆర్డినేటర్) , ఏటీఎం ఎంజీబీఎస్ , అసిస్టేంట్ మేనేజర్ ఎంజీబీఎస్ , స్టేషన్ మేనేజర్ ఎంజీబీఎస్ , విచారణ కోరకు 040-12666, , , , జేబీఎస్ , దిల్‌సుఖ్‌నగర్ నెంబర్లకు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.