మొబైల్ మార్కెట్లో ఐ ఫోన్లకున్న క్రేజ్ మరో సారి ప్రూవ్ అయింది. శుక్రవారం మార్కెట్లోకి రిలీజైన ఐ ఫోన్ 6, ఐ ఫోన్ 6 ప్లస్ లు మూడు రోజుల్లోనే...
మొబైల్ మార్కెట్లో ఐ ఫోన్లకున్న క్రేజ్ మరో సారి ప్రూవ్ అయింది. శుక్రవారం మార్కెట్లోకి రిలీజైన ఐ ఫోన్ 6, ఐ ఫోన్ 6 ప్లస్ లు మూడు రోజుల్లోనే కోటి ఫోన్లు అమ్ముడై…గత రికార్డు ను బ్రేక్ చేశాయి. ఇంతకు ముందు ఐ ఫోన్ 5, రిలీజైన మూడు రోజుల్లో 90 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ కొత్త ఫోన్లు ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ ,ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి 10 దేశాల్లో మాత్రమే అందుబాటులోకి ఉండగా, సెప్టెంబర్ 26 నుండి మరో 20 దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇంకా ఎక్కువ ఫోన్లు అమ్మాల్సిందని, భారీగా వచ్చిన ఆర్డర్లకు సాధ్యమైనంత త్వరగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నామని యాపిల్ సీఇఓ టిం కుక్ అన్నాడు.