శ్రీరాంపూర్ : గోదావరిఖని లో తెలంగాణా బొగ్గు ఘని కార్మిక సంగం మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య నిర్వహిస్తున్న తెలంగాణా స్ఫూర్తి సభ ఘనంగ...

శ్రీరాంపూర్ : గోదావరిఖని లో తెలంగాణా బొగ్గు ఘని కార్మిక సంగం మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య నిర్వహిస్తున్న తెలంగాణా స్ఫూర్తి సభ ఘనంగా జరిగింది. దాదాపు 3000 మంది సింగరేణి కార్మికులు దీనికి హాజరయ్యారు. ఈ సభకు TBGKS గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రావలసి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోయారు.
ఈ సభకుపెద్దపల్లి ఎం.పి. బాల్క సుమన్ గారు , ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయన గారు, కోవ లక్ష్మి, పుట్ట మధు, నల్లాల ఓదెలు, సోమరపు సత్య నారాయణ, నడిపెల్లి దివాకర్ రావు, C M పేశి ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, అన్ని ఏరియాల TBGKS నాయకులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ మాజీ అధ్యక్షుడు బంటు సారయ్య గారు Tdaily.In తో మాట్లాడుతూ ... తెలంగాణా ఉద్యమం లో సింగరేణి కార్మికులు పాల్గొన్న తీరు , చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతున్దన్నారు. సెప్టెంబర్ 13, 2011 న ప్రారంబమైన సకలజనుల సమ్మె నిర్విరామంగా 35 రోజులపాటు జరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించిందన్నారు. సింగరేణి కార్మికులు జీతాలకోసం సమ్మె చేసిన రోజులే తప్ప, వారి జీవితాల కోసం చేసిన చరిత్ర ఈ సకలజనుల సమ్మె కె దక్కుతుందన్నారు.






