హైదరాబాద్ : వాహనాల నంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం...
హైదరాబాద్ : వాహనాల నంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. నంబర్ ప్లేట్ల రీ-రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం, రవాణాశాఖకు హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రిజిస్ట్రేషన్ల పేరిట పౌరులను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్ట్రేషన్లను ఎలా మారుస్తారని అడిగింది. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సరికాదు అని పేర్కొంది.