ఢిల్లీ ‘జూ’ పార్క్ లో ఘోరం జరిగింది. సరదాగా ఫ్రెండ్స్ తో ‘జూ’ కి వెళ్ళిన హిమాన్షు, తెల్లపులి నోటికి చిక్కి ప్రాణాలు వదిలాడు. ఇంతకీ ఏ...
ఢిల్లీ ‘జూ’ పార్క్ లో ఘోరం జరిగింది. సరదాగా ఫ్రెండ్స్ తో ‘జూ’ కి వెళ్ళిన హిమాన్షు, తెల్లపులి నోటికి చిక్కి ప్రాణాలు వదిలాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఢిల్లీకి చెందిన హిమాన్షు ఫ్రెండ్స్ తో కలిసి ‘ఢిల్లీ జూ’ కి వెళ్ళాడు. ఒంటిగంటన్నర టైమ్ లో అతను పులిని చూడటానికి ఎన్ క్లోజర్ కున్న కంచె పైకి ఎక్కాడు, అక్కడినుంచి ఫొటో తీయడానికి ప్రయత్నం చేస్తూ ప్రమాదవశాత్తు పులి ఉన్న వైపు పడిపోయాడు…….10 నిమిషాలపాటు తెల్లపులి అతణ్ణి ఏమీ చేయలేదు. అలా చూస్తూ నిలుచుంది. అయితే, హిమాన్షు పడిపోవడం గమనించిన మిగతావాళ్ళు పులిమీద రాళ్ళు విసిరారు. వెంటనే పులి మారిపోయింది. హిమాన్షుపై దాడికి దిగింది. పంజా విసరి నేలమీద పడేసింది. కింద పడిపోయాక, నోట కరుచుకుని పరుగు తీసింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. ఏమన్నా చేద్దామన్నా కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే, పులికి మత్తు ఇవ్వడానికి అవసరమైన పరికరాలు వాళ్ళ దగ్గర లేవు. కంచె దూకి వెళ్ళి కాపాడే ధైర్యమూ లేదు. కనీసం మిగతావాళ్ళకి చెప్పడానికి వాకీ టాకీలు కూడా లేవు. దీనితో పులికి హిమాన్షు బలయ్యాడు.
తీవ్ర గాయాలపాలైన హిమాన్షును హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాడు. దేశానికి రాజధాని ఢిల్లీలో ఉన్న జూలో ఇలాంటి పరిస్థితి ఉండడం చూసి జనం విస్తుపోతున్నారు.