కొత్త జిల్లాగా మంచిర్యాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సర్కారు చురుగ్గా పావులు కదుపుతోంది. తాజాగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వ...
కొత్త జిల్లాగా మంచిర్యాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సర్కారు చురుగ్గా పావులు కదుపుతోంది. తాజాగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలపై భూపరిపాలన శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూముల వివరాలు పంపాలంటూ లేఖ రాసింది. ఇందులో మంచిర్యాల కూడా ఉండగా, తూర్పు జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
-చెరో 26 మండలాలు..
ప్రస్తుతం జిల్లాలో 52 మండలాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మంచిర్యాల జిల్లా అయితే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు (మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్), 26 మండలాలు వచ్చే అవకాశముంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్లకుతోడు కొత్తగా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌గా మారనుంది. పాలన పరంగా సౌలభ్యం పెరగనుండగా, మారుమూల ప్రజలకు ప్రయోజనం జరగనుంది.
-తీరనున్న కష్టాలు..
ఆదిలాబాద్ రెండు జిల్లాలుగా విడిపోతే, ముఖ్యం గా మారుమూల మండలాలకు దూర భారం తగ్గనుంది. జిల్లాకేంద్రం చేరువై సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వేమనపల్లి, బెజ్జూర్, దహెగాం, మండలం నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించాలి. దాదాపు ఒక రోజంతా సమయం తీసుకుంటుంది. ఇదే సమయంలో నాలుగు జిల్లాలు దాటి హైదరాబాద్ వెళ్లొచ్చు. కోటపల్లి, చెన్నూర్, కాగజ్‌నగర్, వాంకిడి, కౌటాల, సిర్పూర్(టీ) మండలాల ప్రజలు వందలాది కిలోమీటర్లు ప్ర యాణించాల్సిందే. ఏదైనా పని ఉండి ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే ఆయాప్రాంతాల్లోని ఉద్యోగులు, ప్రజలు పనులు మానుకుని వెళ్లాల్సివస్తోంది. ఇదే మంచిర్యాల జిల్లాగా ఏర్పడితే దూర భారం సగం కంటే తక్కువ కానుంది. కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లాకేంద్రానికి చేరుకోవచ్చు.
-బెల్లంపల్లి జిల్లా లేనట్లే..
మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు జరుగుతుండటంతో బెల్లంపల్లి జిల్లా డిమాండ్ ఆటకెక్కినట్లే కనిపిస్తుంది. బెల్లంపల్లి జిల్లా కేంద్రమయితే ఎన్నో సౌకర్యాలు, సౌలభ్యాలు ఉంటాయంటూ అక్కడి ప్రాంత వాసులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా బెల్లంపల్లిలో ఎన్నో సింగరేణి భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు వృథాగా ఉన్నాయి. అంతే కాకుండా వందలాది ఎకరాల భూములు ఖాళీగా ఉంటున్నాయి. ఒక వేళ ప్రభుత్వం బెల్లంపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే పైసా ఖర్చు లేకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని బెల్లంపల్లి వాసులు చెబుతూ వచ్చారు. బెల్లంపల్లి జిల్లా చేయాలంటూ ఆందోళనలు, నిరసన దీక్షలు చేపట్టారు. అయినప్పటికి దశాబ్దాలుగా డిమాండ్‌లో ఉన్న మంచిర్యాలనే జిల్లా కేంద్రం చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.