-గాలి సరఫరా లేక కార్మికుడి మృతి -ఆర్కే1ఏ గనిపై ఆందోళన -గని ప్రమాదంగా గుర్తించాలని డిమాండ్ మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గనిలో గాలి సరఫరా...
మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గనిలో గాలి సరఫరా సక్రమంగా లేక ఓ కార్మికుడు మృతి చెం దాడు. రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన చెవులు నారాయణ (55), ఆర్కే 1ఏలో కోల్‌ఫిల్లర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య మాంతమ్మ, ఇద్దరు కుమారులు ప్రశాంత్, స్వా మి, కూతురు శ్రావణి ఉన్నారు. శుక్రవారం రాత్రి గనిలోని మూడో సీం సౌత్, 12వ డీప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన రెండు టబ్బుల్లో బొగ్గు నింపి మూడో టబ్బు నింపుతుండగా పోటీలో గాలి సరఫరా సక్రమంగా లేక అస్వస్థత చెందాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన మృతదేహాన్ని శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు గనిపైకి తీసుకువచ్చారు. చనిపోయిన విషయాన్ని గని మేనేజర్ రమేశ్‌బాబు అంగీకరించకుండా, శవాన్ని ఏరియాసుపత్రికి తరలించే ప్ర యత్నం చేయగా కార్మికులుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గనిపై కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతిని గని ప్రమాదంగా గుర్తించాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాం డ్ చేశారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
-నారాయణ కుటుంబ సభ్యులకు పరామర్శ
టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, మేడిపల్లి సంపత్, జే రవీందర్, ఎల్లయ్య, దుర్గం దుర్గయ్య, మెంగని రాజయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, క్యాతనపల్లి సర్పంచ్ జాడి శ్రీనివాస్, జడ్పీ సభ్యుడు సుదర్శన్ గౌడ్, ఏఐటీయూసీ నాయకులు భానుదాస్, అక్బర్ అలీ, ఐఎన్టీయూసీ నాయకులు మిట్ట సూర్యనారాయణ, సంగ బుచయ్యలు ఏరియా ఆసుపత్రిలో నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.