- దవాఖానలో ఉన్న తమ్ముడికి బాక్స్ తీసుకెళ్తుండగా ఘాతుకం.. -నమ్మించి మోసం చేసిన ఆటోడ్రైవర్ - రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో దారుణం ...
- దవాఖానలో ఉన్న తమ్ముడికి బాక్స్ తీసుకెళ్తుండగా ఘాతుకం..
-నమ్మించి మోసం చేసిన ఆటోడ్రైవర్
- రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో దారుణం
కీసర : దవాఖానలో చికిత్స పొందుతున్న తమ్ముడి ఆకలి తీర్చేందుకు లంచ్‌బాక్స్ తీసుకెళ్లాలనే ఆత్రుత ఓ విద్యార్థినికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. గతంలో ఉన్న ముఖపరిచయం వల్ల ధైరంగా బైక్ ఎక్కిన విద్యార్థిని లైంగికదాడికి గురైంది. రాజధాని శివార్లలో ఓ ఆటోడ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కీసర సీఐ పీ గురువారెడ్డి ఘటన వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (19)ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నది. ఆమె తమ్ముడు అనారోగ్యంతో ఘట్కేసర్లో ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
మంగళవారం తమ్ముడికి భోజనం తీసుకెళ్లేందుకు ఇంటినుంచి లంచ్బాక్సుతో బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై వెళ్తున్న ఆటోడ్రైవర్ నరేశ్ వచ్చి పలకరించాడు. తానూ ఘట్కేసర్ వెళ్తున్నానని నమ్మించాడు. ఇంటర్ చదువుతున్న సమయంలో నరేశ్ ఆటోలో వెళ్లిన పరిచయంతో ధీమాగా బైక్ ఎక్కింది. ఇదే అదనుగా నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి యువతిపై నరేశ్ లైంగికదాడికి పాల్పడ్డా డు. ఈ దృశ్యాలను వీడియోతీశానని బయటకు చెబితే చంపుతానని హెచ్చరించా డు. తర్వాత యువతి తల్లికి విషయం చెప్పడంతో కీసర పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శామీర్‌పేట్ మండలం అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన నరేశ్ పరారీలో ఉన్నాడని, గాలించడానికి బృందాన్ని పంపించామని సీఐ తెలిపారు. యువతిని వైద్య పరీక్షల కోసం దవాఖానకు తరలించారు
.