మందమర్రి మండలంలోని సారంగపల్లి పంచాయతీ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో యువకులు కొండ చిలువను పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉ...
మందమర్రి మండలంలోని సారంగపల్లి పంచాయతీ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో యువకులు కొండ చిలువను పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉప్పిడి మల్లయ్యకు చెందిన మేకల పాగలోకి కొండచిలువ వెళ్తుండగా గమనించిన జక్కుల ప్రసాద్ అనే యువకుడు మందమర్రి పట్టణంలోని తెలంగాణ వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు నాగేంద్రకు సమాచారం అందించాడు. నాగేంద్ర సొసైటీ సభ్యులతో చేరుకుని దానిని పట్టుకున్నారు. 12 అడుగుల పొడుగు 50 కిలోల బరువు ఉంటుందని నాగేంద్ర తెలిపారు. కాసిపేట మండలంలోని దేవాపూర్ గుట్టలలో వదిలివేస్తామని ఆయన తెలిపారు. పాములు, కొండ చిలువలు ఎక్కడ ఉన్నా 9000505553 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. సొసైటీ సభ్యులు రంజిత్, అనిల్, శివ తదితరులు ఉన్నారు.
