నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రౌడీఫెలో. విశాఖసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ గీతరచయిత కృష్ణచైతన్య దర్శక...
నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రౌడీఫెలో. విశాఖసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ గీతరచయిత కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మూవీమిల్స్ అండ్ సినిమా 5 పతాకంపై ప్రకాష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు ఈ నెల 13న విడుదల కానున్నాయి. కాగా ఈ ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు హాజరుకానున్న తొలి సినిమా వేడుక ఇదే కావడం విశేషం. ఇంకా ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ నవ్యమైన కథ, కథనాలతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలోని పాటల వేడుకకు చంద్రబాబునాయుడు రావడం మాకెంతో ఆనందంగా వుంది. సన్నీ.ఎం.ఆర్ ఈ చిత్రానికి చక్కని సంగీతాన్ని అందించాడు. తప్పకుండా పాటలతో పాటు చిత్రం కూడా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
రావురమేష్, పోసాని కృష్ణమురళి, అజయ్,సుప్రీత్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, తాళ్ళూరి రామేశ్వరి, రవి,నందినిరాయ్, సత్య తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ.ఎం.ఆర్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: ఓం, సహ నిర్మాత: సందీప్ కొరిటాల, ఆర్ట్: రఘు కులకర్ణి, నిర్మాణం: మూవీమిల్స్ అండ్ సినిమా.
.