-సీఎం కేసీఆర్కు అందించిన అధికారులు హైదరాబాద్ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్లలో ఇటీవల లభ్యమైన నిజాం రాజుల కాలం నాటి నాణేలను...
-సీఎం కేసీఆర్కు అందించిన అధికారులు
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్లలో ఇటీవల లభ్యమైన నిజాం రాజుల కాలం నాటి నాణేలను పురావస్తుశాఖ నిధిలో భద్ర పరచాలని నిర్ణయించారు. సాంస్కృతిక, పురావస్తుశాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, పురావస్తుశాఖ డైరెక్టర్ శ్రీనివాస్, ఏడీ బ్రహ్మాచారి, రిటైర్డ్ అధికారి రంగాచార్యులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఈ నాణేలను అందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బతుకమ్మ పండగ మయంలో నిజాం కాలం నాటి నాణెలు పురావస్తు నిధిలో జమ కావటం శుభ సూచకమన్నారు. చందుపట్లలో ఇటీవల కూలిపోయిన ఓ ఇంటి శిథిలాల్లో 24 నాణేలు లభించాయి. వీటిపై చార్మినార్ బొమ్మతోపాటు ఉర్దూలో అక్షరాలున్నాయి. వాటిని స్థానిక రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకొని పురావస్తుశాఖ అధికారులకు అప్పగించారు. ఇందులో 11నాణేలు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంనాటివని, మరో 13నాణేలు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలం నాటివని గుర్తించారు. ఒక్కో నాణెం 11నుంచి12 గ్రాముల బరువు ఉందని తెలిపారు.