- హాజరుకానున్న కవితక్క - వేడుకలకు హిందీ ఉన్నత పాఠశాల గ్రౌండ్ ముస్తాబు - సాయంత్రం 6 నుంచి రాత్రి 10 దాకా ఆటాపాటలు - భారీగా తర...
- హాజరుకానున్న కవితక్క
- సాయంత్రం 6 నుంచి రాత్రి 10 దాకా ఆటాపాటలు
- భారీగా తరలిరానున్న మహిళలు
మంచిర్యాల : నమస్తే తెలంగాణ, టీ న్యూస్ సంయుక్త ఆ ధ్వర్యంలో తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న బంగారు బతుకమ్మ వేడుకల కోసం మంచిర్యాలలో ని హిందీ ఉన్నత పాఠశాల మైదానం ము స్తాబైంది. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృ తి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పెద్ద సంఖ్య లో మహిళలు, జిల్లాలోని మహిళా నాయకులు తరలి రానున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆడిపాడనున్నారు.
ఉదయం 11.30 గంటలకు కవిత రాక...
ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల కు ఎంపీ కవిత మంచిర్యాలకు చేరుకుంటారు. ఎ ల్ఐసీ కాలనీలోని ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంట్లో బతుకమ్మను పేర్చి, వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, తూ ర్పు జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, ము న్సిపల్ అధ్యక్షురాలు మామిడిశెట్టి వసుంధర ఇళ్లకు వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి వద్ద నుంచి బతుకమ్మలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఐబీ చౌరస్తా మీదుగా హిందీ ఉన్నత పాఠశాల మైదానికి చేరుకుంటారు. అక్కడ ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే..
హిందీ ఉన్నత పాఠశాల మైదానాన్ని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శనివారం ఉదయం పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏదైనా పూజ చేయాలంటే పూలను వాడుతామని, కానీ, పూలనే దేవుడిగా చేసి కొలిచే పండుగ ఇదొక్కటేనని చెప్పారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకలను ప్రపంచవ్యాప్తం చేశారని పేర్కొన్నారు.
భారీగా ఏర్పాట్లు..
ఆదివారం నిర్వహించనున్న వేడుకలకు మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ చదును చేసి, మహిళలు బతుకమ్మ ఆడేందుకు అనుకూలంగా బారికేడ్లను నిర్మించారు. ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్వయంగా అక్కడ ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపల్ క మిషనర్ వెంకన్న, మున్సిపల్ అధ్యక్షురాలు వ సుంధర ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు జ డ్పీ అధ్యక్షురాలు వల్లకొండ శోభారాణి, మహిళా ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, కోవ లక్ష్మి హాజరుకానున్నారు.
విస్తృతంగా ప్రచారం..
వేడుకలను విజయవంతం చేసేందుకు మహి ళా నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ తూర్పు జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, స్థానిక నాయకురాళ్లు వాడవాడలా తిరుగుతూ బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని మహిళలను ఆహ్వానిస్తున్నారు.