సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెర పడనున్నది. గత నెల 18న ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి ప్రచ...
సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెర పడనున్నది. గత నెల 18న ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి ప్రచారం జోరుగా కొనసాగింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 6గంటల తరువాత మెదక్ పార్లమెంట్ పరిధిలో ఓటు లేనివారు వెళ్ళిపోవాల్సి ఉంటుందని, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గం పరిధిలో 15 లక్షల 43 వేలమంది ఓటర్లుండగా, 1,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల మూడున ప్రారంభమైన ఓటరు స్లిప్‌ల పంపిణీ 90 శాతం పూర్తయిందని అధికారులు చెప్పారు.
