తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ టొరంటో నగరంలోని మిడోవేల్ పార్కు ఈ వేడుకలకు వేదికైంది. దాదా...
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ టొరంటో నగరంలోని మిడోవేల్ పార్కు ఈ వేడుకలకు వేదికైంది. దాదాపు 400 మంది బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆడారు. తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరగడం ఇది పదోసారి కాగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి బతుకమ్మ కావడంతో అందరూ పండుగను అత్యంత సంబురంగా చేసుకొన్నారు.తెలంగాణ కెనడా సంఘం నూతన కమిటీ (2014-16)ని ఎన్నికల సభ్యులు శ్రీనాధ్ కుందూరి, శ్రీనివాస్ తిరునగరి, ప్రకాశ్ చిట్యాల ఈ సందర్భంగా ప్రకటించారు. వ్యవస్థాపక సభ్యుడు రమేశ్ మునుకుంట్ల కమిటీ సభ్యులను పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా చంద్ర స్వర్గం, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు చిత్తలూరి, కార్యదర్శిగా అతీక్ పాషా, సాంస్కృతిక కార్యదర్శిగా వేణుగోపాల్‌రెడ్డి రోకండ్ల, కోశాధికారిగా దేవేందర్‌రెడ్డి గుజ్జుల, సంయుక్త కోశాధికారిగా షంతన్రెడ్డి నేరెల్లపల్లి, డైరెక్టర్లుగా సమ్మయ్య వాసం, సంతోష్ గజవాడ, విజయ్‌కుమార్ తిరుమలాపురం, రవీందర్ బయ్యారపు, వేణురెడ్డి గుడిపాటిలు ఎన్నికయ్యారు. బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులుగా రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, హరి రావుల్కర్, అఖిలేశ్ బెజ్జంకి ఎన్నికయ్యారు.ఉత్తమ బతుకమ్మ మొదటి బహుమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శిరీష చెన్న, గౌతమి కొండబత్తిని, శిరీష స్వర్గం బృందానికి దక్కింది. రెండో బహుమతి శ్రీలత శ్రీరంగం, మూడో బహుమతిని ప్రియ ఈద, సుధ కంబాలపల్లి బృందాలు గెలుచుకున్నాయి. ఉత్తమ బతుకమ్మ పాటలకు శోభా పీచర, స్వాతి మారెపల్లి బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చంద్ర స్వర్గం మాట్లాడుతూ తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. బతుకమ్మలను సమీపంలోని క్రెడిట్ నదిలో నిమజ్జనం చేసిన అనంతరం మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి.
