జీడిమెట్ల: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ...

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సూరారంలోని జ్యోతి మిల్క్ వద్ద విధులు నిర్వహిస్తున్న సాయిదాస్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మీనీ బస్సు (ఎసి10డబ్ల్యూ 5265) ఢీకొంది. ఈ ఘటనలో సాయిదాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది రవీందర్బాబు, వేణు గాయపడిన ఎస్ఐని స్థానిక నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైదులు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, ఏసీపీ శ్యాంసుందర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.