హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 20 శాతాన్ని కార్మికులకు చెల్లిస్తు...

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 20 శాతాన్ని కార్మికులకు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. దసరా, దీపావళి సందర్భంగా కోల్ఇండియా తరహాలో కార్మికులకు రూ.240కోట్ల ప్యాకేజీని బోనస్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రతి కార్మికుడికి సగటున అదనంగా రూ.40 వేల బోనస్ అందనుంది. పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ పద్దతిలో ఈ చెల్లింపులు జరుగనున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 శాతం బోనస్‌ను ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికుల సుదీర్ఘ డిమాండ్‌ను నెరవేర్చారు. దీంతోపాటు సింగరేణిలో 3,100 పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.