భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైల మహిళల మీద 2014 సంవత్సరంల ఇప్పటిదాంక జర్గిన అత్యాచారాల ఇవరాలు పోలీసు కమీషనర్ రాకేష్ మరియా చెప్పిండు. రాక...
భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైల మహిళల మీద 2014 సంవత్సరంల ఇప్పటిదాంక జర్గిన అత్యాచారాల ఇవరాలు పోలీసు కమీషనర్ రాకేష్ మరియా చెప్పిండు.
రాకేష్ మరియా చెప్పిన లెక్కలు చూస్తే ముంబైల కమ్సేకం 72% రేప్ కేసులు బాయ్ ఫ్రెండ్స్ చేసినయే అంట.ముంబైల ఇప్పటి దాంక 542 కేసులు ఫైల్ ఐతే గల్ల 389 కేసులు(71.9%) పెళ్లి చేసుకుంటం అని చెప్పి రేప్ చేసిన కేసులు.ఇయ్యి కాక 6% కేసులు తెల్వనోల్లు చేసినై,మిగిల్న కేసులేమో సుట్టాలు,పక్కాలు,సుట్టరికం ఉన్న తోబుట్టువులు చేసినై అంట.
మహానగరాలల్ల గీలాంటి కేసులు మస్తు పెరిగుతున్నై అని కమీషనర్ మరియా జర్నలిస్ట్ లు అడ్గిన ప్రశ్నకు సమాధానం చెప్పిండు.అక్టోబర్ 31 కల్ల 542 కేసులు మా దగ్గర ఫైల్ ఐతే గల్ల 477 కేసులు పరిష్కరించినం,పోయిన సంవత్సరం గీ సమయానికి మొత్తం 333 కేసులల్ల 316 కేసులు పరిష్కరించినం,పోయిన సంవత్సరం కంటే గీ సంవత్సరం గీలాంటి కేసులు ఎక్కువ రావడం నిజంగా మంచి పరిణామం ఐతే కాదు అని కమీషనర్ చెప్పుకొచ్చిర్రు.
బాధితులు భయం లేకుండా వొచ్చి మాకు కంప్లైంట్ సెయ్యండి,గా బద్మాష్ గాల తాట తీత్తం అని,తప్పిపోయినోల్ల మీద కూడా గట్టిగనే శ్రద్ధ పెడ్తున్నమని మరియా చెప్పిండు.
ఇగ మహిళల దగ్గర్నుంచి గొలుసులు కొట్టేసే దొంగల కేసులు పోయ్న సంవత్సరం కంటే గీ సంవత్సరం తగ్గినయంట.పోయినేడాది 1,832 కేసులు వత్తే గీ ఏడాది 1257 కేసులు మాత్రమే ఫైల్ అయినై,అంటే కమ్సేకం 31% తగ్గినై గీలాంటి కేసులు.