రెండ్రోజుల క్రితం అసెంబ్లీలో కేసీఆర్ చేసిన కామెంట్లతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముంపు మండలాలకు కరెంట్ ఇవ్వడంపై సీఎం చేసిన వ్యాఖ్యలతో ఏపీ...
రెండ్రోజుల క్రితం అసెంబ్లీలో కేసీఆర్ చేసిన కామెంట్లతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముంపు మండలాలకు కరెంట్ ఇవ్వడంపై సీఎం చేసిన వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. పోలవరం ముంపు ప్రాంతాలు ఏపీలో కలవడంతో, ఏపీ నుంచే పవర్ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం డిసైడ్ అయింది. దీని కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచి 30 కిలో మీటర్ల కరెంట్ లైన్లను వేయాలనే నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. దీని కోసం ఇప్పటికే టెండర్లను పిలిచారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా పోలవరం ముంపు మండలాలకు కరెంట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికీ పోలవరం ముంపు మండలాలకు తెలంగాణ ప్రభుత్వమే కరెంట్ ఇస్తోంది. తెలంగాణకు ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అయినా మానవత్వంతో పోలవరం ముంపు మండలాలకు రాష్ట్ర ప్రభుత్వమే కరెంట్ ఇస్తోందని సీఎం కేసీఆర్ రెండ్రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడారు.