భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఈ హైదరాబాదీ ఇప్పుడు ...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఈ హైదరాబాదీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి (యూఎన్వో)లోని ఎండ్ వయ్లెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ క్యాంపెయిన్ (మహిళలపై హింసను అరికట్టడం కోసం కార్యక్రమం)కు దక్షిణాసియా దేశాల ప్రచారకర్తగా ఎంపికైంది. లింగ వివక్షను, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఈ కార్యక్రమం ద్వారా సానియా గళమెత్తనుంది.
ఇందులో భాగంగా భారత్, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాల్లో సానియా పర్యటించనుంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బనంద సోనోవాల్ సమక్షంలో ఐక్యరాజ్య సమితి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపూరి ఈ విషయాన్ని ప్రకటించారు
