చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఎల్ అండ్ టి కంపెనీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తన ...
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఎల్ అండ్ టి కంపెనీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తన దొంగ ఎత్తులతో చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు మీద తన తెలంగాణ పార్టీ నేతలతో వివాదం రేపేందుకు నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. చివరకు ఏమీ చేయలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సంగతి అటుంచితె ఎల్ అండ్ టీ కంపెనీ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, ఆయన విజన్ చూసి ఆశ్చర్యపోయినట్లుంది.
గుజరాత్ లోని సూరత్ సమీపంలోని హజీరాలో ఉన్న ఎల్ అండ్ టీకి చెందిన ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎ.ఎమ్.నాయక్ కేసీఆర్ కు స్వయంగా లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ది కొరకు కేసీఆర్ స్పష్టమయిన విజన్ తో ముందుకు వెళ్తున్నారని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం అయ్యేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్, ఇతర మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వం కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కు ముందు చూపు లేదని, ఆయనకు విజన్ లేదని అంటూ తన గురించి తాను తెగ గొప్పలు చెప్పుకుంటూ అనుకూల మీడియాతో అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడుకు ఈ విషయం తెలిస్తే ఏమవుతాడో ?