ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రగడ తెలిసిందే. దానిపై ఎన్ని కథలు పడ్డారో… ఆంధ్ర ప్రభుత్వం ఎన్ని కబు...
అయితే, అంధ్ర పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంటర్ పరీక్షల విషయంలో తన వాదనకే కట్టుబడి ఉంది. తమ విద్యార్దుల ప్రతిభను వెలికితీయడం,వారి సౌలభ్యం కోసం విడిగానే పరీక్షలు నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఏర్పాటు చేసిన రెండు రాష్ట్రాల సి.ఎస్. ల సమావేశంలో శర్మ తెలంగాణ వాదన వినిపించారు.పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థలకు సంబందించి వివాదం అవసరం లేదని, వాటిలో తెలంగాణలో ఉన్నవి,తెలంగాణకు దక్కుతాయని అన్నారు. ఉమ్మడి రాజధాని పదేళ్లేనని, కాని ఏపీ ప్రభుత్వం శాశ్వత రాజధానిగా భావిస్తున్నట్లు , ఇక్కడి సంస్థలపై పెత్తనం చేయాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు.ఇక విభజించవలసిన సంస్థల విషయంలో షీలా బిడే కమిటీ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని,వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు.