హైదరాబాద్ కు ఉత్తర భాగంలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ రోడ్లపై ఈరోజు రివ్యూ జరిపిన సీఎం, రూ. 25-3...
హైదరాబాద్ కు ఉత్తర భాగంలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ రోడ్లపై ఈరోజు రివ్యూ జరిపిన సీఎం, రూ. 25-30 వేల కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 40 ఏళ్ల వరకు ఇబ్బందులు రాకుండా రోడ్లు నిర్మించాలని అధికారులకు సీఎం సూచించారు. అంతేకాకుండా, హైదరాబాద్ కు నాలుగు వైపులా ఎక్స్ ప్రెస్ హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు నిర్మించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ రివ్యూలో జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేశ్ కుమార్, కెనడా రవాణా వ్యవస్థ నిపుణల బృందం పాల్గొన్నారు.