వివాదాస్పద వ్యాఖ్యలకు, దూకుడుకు పేరుపడిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టేలా మాట్లాడారు. శంషాబాద్ విమా...
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే ఆయన పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టి ఊరుకుంటే సరిపోదని… ఎన్టీఆర్ కుటుంబానికి పదవులివ్వాలని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ఎన్టీఆర్ కుమారుడు, సినీహీరో బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని అన్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ పుట్టి పెరిగిన కృష్ణా జిల్లా బందరు మండలం నిమ్మకూరు గ్రామానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. కేవలం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఏముంటుందన్నారు. ఇంతకీ పొన్నం ఈ మాటలు అన్నదెక్కడో తెలుసా..? సాక్షాత్తు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న తిరుపతి పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మంగళవారం లోక్ సభలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్.టి.ఆర్. పేరు పెట్టడంపై కరీంనగర్ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ మండిపడ్డారు. కావాలంటే ఎన్.టి.ఆర్.పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టుకోవచ్చని, లేదంటే అక్కడున్న ఇతర పట్టణాలకు, విమానాశ్రయాలకు పెట్టుకోవాలని సూచించారు. శంషాబాద్ డొమెస్టిక్ టెరిమినల్ కు ఎన్.టి.ఆర్. పేరును తెలంగాణ ప్రభుత్వానికి సంబందం లేకుండా పెట్టడం సరికాదని వినోద్ అన్నారు.అనకాపల్లి టిడిపి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్.టి.ఆర్ జాతీయ నాయకుడని దానికి కౌంటర్ ఇచ్చారు.