శ్రీహరి హఠాన్మరణం ఆయన అభిమానుల్నే కాదు.. తెలుగువారందరినీ కలచి వేసింది. స్వయం కృషితో ఎదిగిన శ్రీహరి ఎన్నో వేలమందికి అన్నం పెట్టాడు. ఎన్నో స...
ఐతే అదృష్టవశాత్తూ ఆ వార్త అబద్ధమని తేలింది. తనకు అంత పెద్ద జబ్బేమీ లేదని.. మామూలు అనారోగ్యమేనని శాంతి మీడియాకు వెల్లడించింది. ”జాండీస్ సోకి మంచం పట్టిన మాట వాస్తవమే కానీ.. లివర్ ప్రాబ్లెం అన్నది అవాస్తవం. చెన్నైలో నా సోదరి లలితకుమారి ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. మాంసాహారం ముట్టుకోకూడదని వైద్యులు సూచించినప్పటికీ.. కొంచెం కోలుకోగానే.. నాన్ వెజ్ తినడంతో పరిస్థితి విషమించింది. దీంతో మళ్లీ చికిత్స తీసుకున్నా. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా. నా గురించి ఆందోళన చెందవద్దు. మా కుటుంబం గురించి బాధపడిన అందరికీ కృతజ్ఞతలు. ఇంటర్నెట్లో నా ఆరోగ్యం గురించి వార్తలు చదివి.. హైదరాబాద్లోని నా కొడుకు కంగారు పడ్డాడు. వెంటనే ఫోన్ చేశాడు. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా” అని చెప్పింది శాంతి.