మెదక్ ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల మెదక్ ...

మెదక్ ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరు 13న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు. సునీతా లక్ష్మారెడ్డికి 210523 ఓట్లు రాగా ప్రభాకరరెడ్డికి 3,31,277 ఓట్ల మెజారిటీ వచ్చింది. లోక్ సభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా ప్రభాకరరెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం నల్లధనం పై లోక్ సభలో విపక్షాలు నినాదాలతో గందరగళోం సృష్టించాయి. మరోవైపు నల్లధనంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల అనంతరం నల్లధనంపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు మాత్రం తమ పట్టు వీడలేదు. టీఎంసీ, జేడీయూ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకోవటంతో గందరగోళం నెలకొంది. అయినప్పటికీ స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.