మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)తో మాదిగల్లో చైతన్యం తీసుకురావడంలో విజయవంతమయిన నేతగా మందకృష్ణ మాదిగ అందరికీ సుపరిచితుడు. రాష్ట్...
రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణ బిడ్డల ఉసురుపోసుకున్న చంద్రబాబు పాదయాత్రకు మద్దతు పలికి ఆయనకు అండగా ఉండడం, ఆ తరువాత తెలంగాణ ఉద్యమ జేఏసీల నిర్ణయాలను వ్యతిరేకించడం, తెలంగాణ బిల్లు సమయంలో ఆంధ్రా నేతల తీరును ఎదిరించినట్లే ఎదిరించి వెనక్కు తగ్గడం ఆయన మీద అనుమానాలను పెంచింది. ఇక మందకృష్ణ నిర్ణయాల మూలంగా ఎస్సీ రిజర్వేషన్ల పోరాటం పక్కదారి పట్టిందని మాదిగ యువత భావించింది. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పలువురు సొంత సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో మందకృష్ణకు ప్రత్యామ్నాయంగా సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. తాజాగా సీమాంధ్రలోనూ మందకృష్ణకు ఛేదు అనుభవం ఎదురయింది. తిరుపతిలోని సీపీఐ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. మంద కృష్ణ వర్గంగా కొందరు, దండు వీరయ్య వర్గంగా కొందరు విడిపోయారు. విడిపోయిన రెండు వర్గాల మధ్య నినాదాల యుద్ధం నడిచింది. మందకృష్ణ సమక్షంలోనే ఈ పరిస్థితి రావడం ఆయనకు మింగుడుపడని అంశమే.