ప్రధాని మోడీ హైదరాబాద్ పై ప్రశంసలు కురిపించారు. అది కూడా తన విదేశీ టూర్ లో ప్రపంచ దేశాల ప్రెసిడెంట్ల ముందు. భారత ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస...
అటు పెట్టుబడులు ఆకర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు కూడా చేసుకుంది. మైక్రోసాప్ట్, డీలైట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థతో పాటు ఇతర కంపెనీలు తమ పెట్టుబడులు మరింత విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. మరోవైపు భాగ్యనగరానికి మణిహారంగా చెప్పుకునే మెట్రో ప్రాజెక్ట్ పూర్తయితే మరిన్ని వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ఫార్మా కంపెనీలు, బయోటెక్నాలజీ, వ్యవసాయ పరిశోధనా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మున్ముందు రియల్ ఎస్టేట్, బీమా, బ్యాంకింగ్ రంగాలు కూడా మరింత అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు నిపుణులు.