తాండూరు, నవంబర్ 17 (టీ మీడియా): మండల కేంద్రంలోని రేచినిరోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి పడి త...
తాండూరు, నవంబర్ 17 (టీ మీడియా): మండల కేంద్రంలోని రేచినిరోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి పడి తిర్యాణి గ్రామానికి చెందిన కొయ్యడ శేఖర్‌గౌడ్(40) మృతి చెందాడు. తాండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లిలోని తన బంధువు మృతి చెందడంతో శేఖర్‌గౌడ్ ఆదివారం సాయం త్రం ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. రాత్రి 12 గం టల సమయంలో దహన సంస్కరణలు ముగించుకుని సోమవారం తెల్లవారు జా మున ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. కోల్‌యార్డు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ లైట్ల వె లుతురుతో గుంతలు ఏర్పడక వాహనం అదుపు తప్పి కింద పడింది. శేఖర్‌కు భార్య హరక్క, కొ డుకు తరుణ్ ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని ఏఎస్ఐ రాంబాబు, మాదారం ఎస్ఐ కుమారస్వామి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.-వాకింగ్‌కు వెళ్తూ..రెబ్బెన: మండల కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన జయంతిలాల్ వార్(67) మృతి చెందినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... జయంతి లాల్వార్ ప్రతి రోజూ ఉదయం రెబ్బెన నుంచి ఇందిరానగర్‌కు వాకింగ్ చేసేవాడు. అదే క్రమంలో సోమవారం ఉదయం వాకింగ్ చేస్తుం డగా కళాశాల సమీపంలో గుర్తు తెలియని వాహ నం ఢీ కొనగా తలకు బలమైన గాయాలయ్యాయి. 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. జయంతిలాల్ వార్ కొడుకు యోగేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని..లక్ష్మణచాంద: మండలంలోని పీచర-ధర్మారం నుంచి లక్ష్మణచాందకు వెళ్లేదారిలో రెండు ద్వి చక్రవాహనాలు ఢీ కొని ధర్మారం గ్రామానికి చెం దిన కంబోలి ముత్తయ్య (58) మృతి చెందాడు. పీచ ర గ్రామానికి చెందిన తిప్పని మొఘిలేశ్ తీవ్రగాయలవడంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కంబోలి ముత్తయ్య టీవీఎస్ ఎక్సెల్‌పై లక్ష్మణచాంద నుంచి ధర్మారం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తిప్పని మొఘిలేశ్ ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో కంబోలి ముత్తయ్య కింద పడి అక్కడికక్కడే మరణించాడు. మొఘిలేశ్కు తీవ్రగాయాలడంతో నిర్మల్‌లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రాజలింగం పేర్కొన్నారు.