సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం అద్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్నడూ మాట నిలబ...
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం అద్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్నడూ మాట నిలబెట్టుకున్న మనిషి కాదని.. ఆయన కంటే పెద్ద అబద్ధాలకోరు ఎవరూ ఉండరని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టంతో సమాచారం సేకరించడం… దాన్ని అడ్డంపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే నాయకులు ఆ పార్టీలో ఎక్కువయ్యారని… అలాంటి వారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నడుస్తోందని కడిగిపడేశారు.
కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడమే పనని… అలా ఎవరెవరి దగ్గర ఎంతెంత డిమాండ్ చేసి తీసుకున్నారో తన దగ్గర మొత్తం లిస్టు ఉందన్నారు తలసాని. అంతేకాదు దాన్ని ఏదో ఒక రోజు బయటపెడతానని హెచ్చరించారు. సొంత పార్టీ వారినీ చంద్రబాబు వదల్లేదని.. . రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో, ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంలో చంద్రబాబుది అంతా వ్యాపారమేనని ఆరోపించారు. సీఎం అభ్యర్థిగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించినప్పుడు టీడీఎల్పీ నేతగా ఆయన ఎందుకు పనికిరాలేదని నిలదీశారు.