రామగుండం : స్థానిక రైల్వే స్టేషన్లోని బుకింగ్ హాల్ వద్ద ఆదివారం పోగుల ఆగయ్య (50) మృతి చెందాడు. జీఆర్పీ ఔట్ పోస్టు ఇన్చార్జి హెడ్ కానిస్టే...
రామగుండం : స్థానిక రైల్వే స్టేషన్లోని బుకింగ్ హాల్ వద్ద ఆదివారం పోగుల ఆగయ్య (50) మృతి చెందాడు. జీఆర్పీ ఔట్ పోస్టు ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ బషీర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుకింగ్ హాల్ వద్ద ఒకరు మృతి చెందినట్లు భాగ్యనగర్ రైలు కు వెళ్లే ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్దకు వెళ్లి పరిశీలించగా, మృతుడి వద్ద దొరికిన సెల్ఫోన్ ఆధారంగా వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన పోగుల ఆగయ్యగా గుర్తించారు. ఆగయ్య తాపీమేస్త్రీగా పని చేస్తాడని బంధువులు తెలిపారు.
ఆగయ్య భార్య 20ఏళ్ల క్రితం వెళ్లిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రతి శనివారం కాజిపేటలోని కర్నపురం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాడు. రామగుండం ఎందుకు వచ్చాడ నే విషయం తెలియలేదు. భాగ్యనగర్ రైలుకు వెళ్లే క్రమంలో ఆగయ్య మృతి చెందినట్లు భావిస్తున్నామనీ, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గోదావరిఖని మార్చురీకి తరలించామని తెలిపారు.