-ఇదీ మందుబాబులు తాగిన మద్యం లెక్క.. -గతేడాదితో పోల్చితే రూ. 2.32 కోట్లు ఎక్కువ .. -మద్యం ధరలు పెరిగినా తగ్గని విక్రయాలు.. -ఎక్సైజ్ శాఖ ...
-ఇదీ మందుబాబులు తాగిన మద్యం లెక్క..
-గతేడాదితో పోల్చితే రూ. 2.32 కోట్లు ఎక్కువ ..
-మద్యం ధరలు పెరిగినా తగ్గని విక్రయాలు..
-ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగానే కాసులు
-ఈ నెలాఖరుకు మరో రూ.28 కోట్ల మద్యం విక్రయించే అవకాశం
-గతేడాదితో పోల్చితే రూ. 2.32 కోట్లు ఎక్కువ ..
-మద్యం ధరలు పెరిగినా తగ్గని విక్రయాలు..
-ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగానే కాసులు
-ఈ నెలాఖరుకు మరో రూ.28 కోట్ల మద్యం విక్రయించే అవకాశం
(టీ మీడియా - వైరా): జిల్లాలో మద్యం విక్రయాల జోరు పెరిగింది. ఆబ్కారీ ఖాజానా నిండింది. ఒక లక్షో, రెండు లక్షలో వ్యత్యాసంతో కాదండోయ్!! కోట్లకొద్దీ వ్యత్యాసం ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 578 కోట్ల, 23 లక్షల, 16 వేల, 328 రూపాయల మద్యాన్ని మన జిల్లాలో మందుబాబులు ఎంచక్కా తాగేశారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.2.32 కోట్ల పైచిలుకే అదనపు విక్రయాలు జరిగాయి. 2015 జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ నెలలో మిగిలిన ఎనిమిది రోజుల వ్యవధిలో సుమారు మరో రూ.28 కోట్లు మద్యం విక్రయాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు రూ.30 కోట్లు మద్యం విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.
కోట్ల మద్యాన్ని తాగేశారు.. జిల్లాలో మద్యం విక్రయాల సరళిని ఒక్కసారి పరిశీలిస్తే అమ్మకాల పెరుగుదల కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అంటే 2014 జనవరి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జిల్లాలో 578 కోట్ల, 23 లక్షల, 16 వేల, 328 రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. అయితే గడిచిన ఐదేళ్లుగా ఈ పెరుగుదల కనిపిస్తూనే ఉంది. కాగా గతేడాది 575 కోట్ల, 90 లక్షల, 88 వేల, 624 రూపాయల మద్యం జిల్లాలో విక్రయించారు. ఈ ఏడాది అత్యధికంగా మే నెలలో 84 కోట్ల, 73 లక్షల, 59 వేల, 419 రూపాయల మద్యం అమ్ముడైంది. వైరాలో ఐఎంఎల్ డిపో స్థాపించిన తర్వాత ఎప్పుడు జరగనంత అత్యధిక స్థాయిలో మద్యం విక్రయాలు నడివేసవి నెలలో జరిగాయి. మే నెలలో 84 కోట్లు మద్యం విక్రయాలు జరిగి ఆ నెల ఐఎంఎల్ డిపో చరిత్ర లో రికార్డుకెక్కింది. ఈ నెలలో గతంలో ఎన్నడు లేనివిధంగా 2 లక్షల, 36 వేల, 258 బీరు కేసుల విక్రయాలు జరిగాయి.
అంటే మండు వేసవి అయిన మే నెలలో జిల్లాలోని మద్యంబాబులు బీర్లుతో తెగ ఎంజాయ్ చేశారన్నమాట.ఇది గతేడాది కంటే రెట్టింపు కావడం విశేషం. అలాగే ఫిబ్రవరి నెలలో 56 కోట్ల, 71 లక్షల, 59 వేల, 149 రూపాయల మద్యాన్ని మన మందు బాబులు తాగే శారు. అయితే ఇదే నెలలో 1 లక్షల 10 వేల, 311 కేసులు బీర్లను మనోళ్లు మండు వేసవిలో చల్ల చల్లగా తాగేశారు. ఇక గతేడాది అత్యధికంగా మద్యం అమ్ముడైన వైనాన్ని పరిశీలిస్తే ఆగస్టు నెలలో 58 కోట్ల, 35 లక్షల, 65 వేల, 385 రూపాయల మద్యం జిల్లాలో విక్రయమైంది. అలాగే గత సంవత్సరం మే నెలలో 57 కోట్ల 04 లక్షల, 49 వేల, 354 రూపాయల మద్యం అమ్ముడవగా, ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ పదహారు రోజుల్లోనే 22 కోట్ల 31 లక్షల, 8 వేల 288 రూపాయల విక్రయాలు సాగాయి. దీన్ని బట్టి చేస్తే ఈ నెల గడిచే నాటికి గతేడాది డిసెంబర్ విక్రయాలను తలదన్నేలా ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి చలికాలం ప్రభావం బీర్ల అమ్మకాలపై పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. నవంబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 62వేల, 058 కేసుల బీర్లు అమ్ముడవగా, ఈ నెలలో ఇప్పటి వరకు 37వేల, 270 కేసుల బీర్లు విక్రయమయ్యాయి.
ప్రతేటా ఆదాయాన్ని బేరీజు వేసుకుంటున్న ఎక్సైజ్ శాఖ కల్తీ విక్రయాలు, ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న తీరును ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బజారు వ్యాపారుల జోరుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. జిల్లాలో 148 వైన్ షాపులు, 44 బార్ షాపులు, మూడు క్లబ్లు (సారపాక, ఖమ్మం) నడుస్తుండగా వీటికి సమాంతరంగా బెల్ట్ షాపులు మనుగడ సాగిస్తున్నాయి. అయితే సాధారణంగా వైన్షాపుల్లోనే ఎమ్మార్పీ ధరల కంటే అధిక మొత్తాన్ని మందు బాబుల నుంచి పిండుతుండగా ఇక బెల్ట్ దుకాణాల దోపిడీకి అ డ్డూ అదుపే ఉండదు. వీటిపై అడపాదడపా దాడులు నిర్వహించి ఆ తర్వాత సర్దుకుంటున్న అబ్కారీ, పోలీస్ శాఖలు ఎంచక్కా నెలసరి ఆమ్యామ్యాలతో కాలం గడుపుతున్నారు. తమ లక్ష్యాలను అధిగ మించాలనే ఉద్దేశంతో ఆదాయంపైనే మనసు పెడుతున్న అధికారులు మద్యం వ్యాపారంపై కన్నేయడం మరిచారు. దీం తో ఈ ప్రభావం పేద, వర్గాలపై పడుతోంది.
మద్యం విక్రయాలపై కన్పించిన ఎన్నికల ప్రభావం..
ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాల పెరుగుదలకు కారణమైంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు పెరిగాయి.