-దత్తత గ్రామాన్ని సందర్శించిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ -సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని అధికారులకు ఆదేశం- -ఆలయంలో ఎం...
-దత్తత గ్రామాన్ని సందర్శించిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్
-సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని అధికారులకు ఆదేశం- -ఆలయంలో ఎంపీ పూజలు
గూడెం(దండేపల్లి): గూడెం గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. తాను దత్తాత తీసుకున్న దండేపల్లి మండలం గూడెం గ్రామాన్ని ఎంపీ బాల్క సు మన్ సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వాడ వాడలా తిరిగి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ముఖ్యం గా తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు తదితర సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. వాటి కి అయ్యే ఖర్చులను సంబంధిత అధికారులకు ఎంత మొత్తం ఖర్చవుతుందో అంచనా వేసి చె ప్పాలని అధికారులను ఆదేశించారు. తమకు పింఛన్ రాలేదని వృద్ధ్దురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో స్పందించిన ఎంపీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చూస్తామన్నారు.
రేషన్ కార్డుల విషయంలో కూడా ఎవరికి నష్టం జరుగదని, ప్రతి పక్షాల మాటలు నమ్మవద్దని, ఈ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పాటుపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోల్ల మంజుల, వైస్ ఎంపీపీ ఆకుల రా జేందర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కుమారస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధు, ఈఓపీఆర్డీ శివక్రిష్ణ, ఎంపీటీసీలు ముత్తె నారాయణ, నె ల్కి సుభాష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీర్ల వెంకటేశ్వర్లు, తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, నాయకులు పూరేళ్ల లక్ష్మ ణ్, ఇప్ప రమేశ్, గడిగొప్పుల సురేందర్, బండా రి మల్లేశ్,శివలాల్, కానుగంటి మధు, కానుగంటి తిరుపతి, పీఆర్ ఏఈ పరంజ్యో తి, తదితరులు పాల్గొన్నారు.
ఆలయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతా
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. గూడెం గుట్ట శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఆదివారం ఎంపీ బాల్క సుమన్ సందర్శించారు. ముందుగా ఆయనను ఆలయ అధికారులు పూ ర్ణ కుంభంతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఎంపీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గూడెం గుట్ట ఆలయ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, స్వామి వారి కొండకు చేరుకునేందుకు ఘాట్ రోడ్డును నాలుగుకోట్లతో నిర్మిస్తామన్నారు. తమకు ఎ లాంటి వ్యాపారాలు లేవని, 24 గంటలు ప్రజా సేవలోనే ఉంటాననన్నారు. ఆయన వెంట ఆల య ఈఓ చక్రవర్తుల పురుషోత్తమచార్యులు, ఎం పీపీ మంజుల, వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, చీర్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.