సౌత్ లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ హైకమాండ్. ముఖ్యంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్టేట్ లో సభ్యత్వ నమోదు ద్వ...
సౌత్ లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ హైకమాండ్. ముఖ్యంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్టేట్ లో సభ్యత్వ నమోదు ద్వారా…పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలనుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తోపాటు.. ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగుతున్నారు.
నార్త్ మేనియా సౌత్ లోకి!
ఉత్తరాది రాష్ట్రాల్లో సాధించిన మ్యాజిక్ ఫిగర్ ను పర్మినెంట్ గా నిలబెట్టుకోవడంతో పాటు…దక్షిణాది రాష్ట్రాలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు.. ప్రధాని మంత్రి మోడీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
సౌత్ పునాదిగా తెలంగాణ
ఇందులో భాగంగా…సౌత్ స్టేట్స్ ప్లాన్ కు తెలంగాణే పునాది కావాలని ఇప్పటికే పిలుపు నిచ్చారు అమిత్ షా. దీంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. నాలుగు లక్షల పార్టీ సభ్యత్వాలు ఉన్న స్టేట్ లో ఏకంగా 23లక్షల సభ్యులను చేర్చుకోవాలని డిసైడయ్యారు. ఇందుకనుగుణంగా…పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవాలకు జాతీయ నేతల్ని పిలుస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 20న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఫిబ్రబరిలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారు.
మొత్తానికి ఆయారాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తే…జనంలోకి వేగంగా దూసుకెళ్లొచ్చనేది బీజేపీ అగ్రనేతల అంతరంగంగా కనిపిస్తోంది. నార్త్ లో పనిచేసిన మోడి అమిత్ షా మంత్రం రాష్ట్రంలో ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.
