హైదరాబాద్: ఆర్టీసీ విభజనలో కదలిక మొదలైంది. సీఎం కేసీఆర్ స్వయంగా విభజనపై జోక్యం చేసుకోవడంతో కేంద్రంలో చలనం వచ్చింది. విభజన కోసం రవాణాశాఖ ...
హైదరాబాద్: ఆర్టీసీ విభజనలో కదలిక మొదలైంది. సీఎం కేసీఆర్ స్వయంగా విభజనపై జోక్యం చేసుకోవడంతో కేంద్రంలో చలనం వచ్చింది. విభజన కోసం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని ఢిల్లీకి పంపడంతోపాటు, ఆర్టీసీని త్వరగా విభజించాలని కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. దీంతో ఇరు రాష్ర్టాల ప్రభు త్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి, విభజనను వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటులో జాప్యం జరిగితే కోలుకోలేని నష్టాల్లోకి సంస్థ వెళ్ళిపోవడం ఖాయమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఆర్టీసీ పరిస్థితులను అంచనా వేయడానికి సీఎం అధికారులతో సమీక్ష జరిపి స్టేటస్ రిపోర్టును పరిశీలించారు. గతంతో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరిగిపోయాయి. దీంతో విభజనపై కేంద్రంతో సీఎం మాట్లాడారు. కాగా ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి తెలిపారు.