జమ్ముకశ్మీర్, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగానే వచ్చాయి. కశ్మీర్‌లో హంగ్ ఏర్పడగా.. జార్ఖండ్‌ను మాత్రం బీజేపీ...
జమ్ముకశ్మీర్, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగానే వచ్చాయి. కశ్మీర్‌లో హంగ్ ఏర్పడగా.. జార్ఖండ్‌ను మాత్రం బీజేపీ బొటాబొటీ మెజార్టీతో దక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ సిద్ధమవుతుంటే.. అటు జార్ఖండ్‌లో తొలిసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో 28 స్థానాలు గెల్చుకోవడంద్వారా పీడీపీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ఆ పార్టీకి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కలేదు.
-పెద్ద పార్టీగా పీడీపీ
-ప్రభుత్వ ఏర్పాటు లేదా మద్దతు.. దేనికైనా రెడీ : అమిత్‌షా
-హడావుడిపడబోమన్న పీడీపీ.. మమ్మల్ని విస్మరించలేరన్న ఒమర్
-జార్ఖండ్ సీఎం రేసులో రఘువర్ దాస్
-బీజేపీ కూటమికి మ్యాజిక్ ఫిగర్
-14 ఏండ్ల తర్వాత సుస్థిర సర్కార్‌కు లైన్‌క్లియర్
-బీజేపీ 37, మిత్రపక్షం ఏజేఎస్‌యూ 5
-ఓటమిపాలైన అధికార జేఎంఎం కూటమి
-నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. సీఎం అభ్యర్థిపై నిర్ణయం
-ప్రభుత్వ ఏర్పాటు లేదా మద్దతు.. దేనికైనా రెడీ : అమిత్‌షా
-హడావుడిపడబోమన్న పీడీపీ.. మమ్మల్ని విస్మరించలేరన్న ఒమర్
-జార్ఖండ్ సీఎం రేసులో రఘువర్ దాస్
-బీజేపీ కూటమికి మ్యాజిక్ ఫిగర్
-14 ఏండ్ల తర్వాత సుస్థిర సర్కార్‌కు లైన్‌క్లియర్
-బీజేపీ 37, మిత్రపక్షం ఏజేఎస్‌యూ 5
-ఓటమిపాలైన అధికార జేఎంఎం కూటమి
-నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. సీఎం అభ్యర్థిపై నిర్ణయం
మోదీ హవా ఆసరాగా ఎన్నికల్లో పోరాడిన బీజేపీకి 25 సీట్లు వచ్చినా.. అవన్నీ జమ్ము ప్రాంతంనుంచే వచ్చాయి. కశ్మీర్ ప్రాంతంలో 34 స్థానాల్లో పోటీ చేస్తే.. 33 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. లడఖ్‌లో కూడా ఆ పార్టీకి ఒక్క స్థానం రాలేదు. రాష్ట్రంలో మిషన్ 44+ లక్ష్యంతో బరిలోకి దిగిన బీజేపీకి ఇది నిరాశకల్గించే అంశమే అ యినా..
రెండో పార్టీగా నిలువడం అనేది ఊరట. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకీ మెజార్టీ రాని నేపథ్యంలో తాము అన్ని అవకాశాలను పరిశీలిస్తామని పీడీపీ, బీజేపీ పేర్కొంటున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, ప్రభుత్వానికి మద్దతు తీసుకోవడం అనే మూడు అంశాలూ తమ పరిశీలనలో ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము హడావుడి పడబోమని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. సమయం తీసుకుని, అన్ని అంశాలు పరిశీలించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో తమను ఏ పార్టీ కూడా విస్మరించజాలదని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్న ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడం విశేషం.
అవసరమైతే పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమన్న సంకేతాలు కూడా ఒమర్ ఇచ్చారు. అదే సమయంలో హుందాగా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకూ సిద్ధమని చెప్పడం విశేషం. స్థూలంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లలో ఏదో ఒక పార్టీ మద్దతు పీడీపీ తీసుకోవడం ఖాయం. వెరసి.. రానున్న రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు అంశం కొత్త సమీకరణాలకు నాంది పలికేటట్టుగా కనిపిస్తున్నది. అటు జార్ఖండ్‌లో రాష్ట్రం ఏర్పడిన 14 ఏండ్ల తర్వాత మొదటిసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ మిత్రపక్షమైన ఏజేఎస్‌యూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని బీజేపీ దక్కించుకుంది.
అభివృద్ధి, సుస్థిరత మంత్రం పఠించిన బీజేపీ.. ఆ కోణంలో ఓటర్లను మెప్పించడంలో సఫలమైంది. అధికార జార్ఖండ్‌ముక్తి మోర్జా రెండో స్థానంలో నిలిస్తే.. కాంగ్రెస్ దారుణ పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనేది సస్పెన్స్‌గా ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అర్జున్‌ముండా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సీఎం పీఠం కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్ పేరు కూడా రౌండ్లు కొడుతున్నది. ప్రధాని మోదీ ఈసారి గిరిజనేతరుడిని కీలక పదవికి ఎంపిక చేస్తారన్న అంచనాల నేపథ్యంలో రఘువర్‌దాస్‌కు చాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు.
రాంచీ, డిసెంబర్ 23: గిరిజన ప్రాబల్య రాష్ట్రమైన జార్ఖండ్‌లో తొలిసారిగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బీజం పడింది. గత 14 ఏండ్లలో తొమ్మిది ప్రభుత్వాలు, మూడుసార్లు రాష్ట్రపతి పాలన చవిచూసి.. ఏ ఒక్క సర్కార్ కూడా పూర్తికాలం మనుగడ సాగించని నేపథ్యంలో సుస్థిర పాలన, అభివృద్ధి పేరిట బీజేపీ పఠించిన మంత్రం ఫలించింది. మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) మద్దతుతో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ (41)ను అందుకోగలిగింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో 42 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించింది. ఐదు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 37 సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షం ఏజేఎస్‌యూ ఐదుస్థానాలు కైవసం చేసుకుంది.
ఒంటరిగా పోటీచేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 19 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం-పీ) ఎనిమిది స్థానాలు గెలుపొందగా, జార్ఖండ్ పార్టీ, మార్క్సిస్టు కో ఆర్డినేషన్, సీపీఐ (ఎంఎల్-ఎల్), బీఎస్పీ తలో ఓ స్థానాన్ని సొంతం చేసుకుంది. హేమంత్ సోరెన్ సంకీర్ణ ప్రభుత్వంలోని తొమ్మిది మంది మంత్రులతోపాటు స్పీకర్ ఓడిపోయారు. సీఎం హేమంత్ సోరెన్ సైతం బర్‌హైత్ స్థానంలో విజయం సాధించినప్పటికీ.. తన సిట్టింగ్ నియోజకవర్గమైన దుమ్కాలో పరాజయం పాలయ్యారు.
ఓటమి అంగీకరించిన హేమంత్‌సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. బీజేపీ మొత్తం 72 స్థానాల్లో పోటీచేయగా, మిత్రపక్షం ఏజేఎస్‌యూ 8 స్థానాల్లో, మరో మిత్రపక్షం ఎల్జేపీ ఓ నియోజకవర్గంలో బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన ఆర్జేడీ, జేడీయూ ఖాతా తెరువలేకపోయాయి. జార్ఖండ్‌లో బీజేపీ విజయం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. 2009 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి 20 సీట్లు అధికంగా గెలుపొందింది. జార్ఖండ్ బీజేపీ కార్యకర్తలకు నా అభినందనలు. వారి అంకితభావం, నిస్వార్థ పనితీరు వల్లే ఈ ఫలితాలు వచ్చాయి అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అంచనాలకు చేరని మోదీ మంత్రం: దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తుందన్న అంచనాల నేపథ్యంలో జార్ఖండ్‌లోనూ బీజేపీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి మెజారిటీ మార్కు దాటినప్పటికీ అనుకున్న మేరకు ఫలితాలు మాత్రం సాధించలేకపోయింది. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోకపోగా, మిత్రపక్షంతో కలిసి బొటాబొటి మెజారిటీని సాధించింది. పార్టీ దాదాపు 50 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, అభ్యర్థుల ఎంపికలో తప్పుడు నిర్ణయాల వల్ల బీజేపీ అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయిందని జార్ఖండ్ కమలం నేతలు అంటున్నారు.
తొలిసారిగా గిరిజనేతర ముఖ్యమంత్రి! : జార్ఖండ్ ఫలితాలు మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న అర్జున్‌ముండాతోపాటు మాజీ ముఖ్యమంత్రులైన మధుకోడా, బాబూలాల్ మరాండీ ఓటమిపాలయ్యారు. దీంతో జార్ఖండ్‌లో తొలిసారి గిరిజనేతర వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది. బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి రఘుబార్‌దాస్ సీఎం రేసులో ముందున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఢిల్లీలో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించనుంది.
జమ్ముకశ్మీర్‌లో హంగ్
శ్రీనగర్, డిసెంబర్ 23: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిరేపిన జమ్ముకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకానున్నది. 87 స్థానాలున్న రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు. 28 సీట్లతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అతిపెద్దపార్టీగా అవతరించగా.. మిషన్ 44 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ 25 సీట్లు గెలిచి రెండోస్థానానికి ఎగబాకింది. 2008 ఎన్నికల్లో 11 స్థానాలతో ఉన్న బీజేపీ ఈసారి 14 స్థానాలు అధికంగా కైవసం చేసుకోవడం గమనార్హం. అయితే రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కావాల్సిన 44 సీట్ల మార్క్‌కు చాలాదూరంలో నిలిచిపోయాయి.
-28 సీట్లతో అతిపెద్ద పార్టీగా పీడీపీ
-25 సీట్లకు పెరిగిన బీజేపీ బలం
-అధికార నేషనల్ కాన్ఫరెన్స్ దారుణపరాజయం
-ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడబోమన్న పీడీపీ
-అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయన్న బీజేపీ
-పీడీపీకి మద్దతుపై సంకేతాలిచ్చిన ఒమర్
-25 సీట్లకు పెరిగిన బీజేపీ బలం
-అధికార నేషనల్ కాన్ఫరెన్స్ దారుణపరాజయం
-ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడబోమన్న పీడీపీ
-అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయన్న బీజేపీ
-పీడీపీకి మద్దతుపై సంకేతాలిచ్చిన ఒమర్
అధికార నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం 15 స్థానాల్లో విజయం సాధించగా.. రెండుస్థానాల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోనావార్‌లో ఓడగా.. బీర్వా నుంచి విజయం సాధించారు. ఒమర్ బుధవారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ 12 స్థానాలతో నాలుగోస్థానంలో నిలిచింది. అత్యధిక స్థానాలు గెలిచిన పీడీపీ ఎవరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఆ పార్టీకి మద్దతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరికితోడు ఇప్పటివరకు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పీడీపీ కోరితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్న సంకేతాలు ఇచ్చింది.
అయితే ప్రభుత్వ ఏర్పాటులో తొందరపడబోమని.. ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కొంత సమయం పడుతుందని పీడీపీ అధ్యక్షురాలు మహబూబాముఫ్తీ అన్నారు. అటు అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా.. మద్దతుపై ఎటూ తేల్చలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పీడీపీ, బీజేపీ కలిసి లేదా కాంగ్రెస్, ఇతర స్వతంత్రుల మద్దతుతో పీడీపీ లేదా ఎన్సీతోపాటు కొంతమంది స్వతంత్రుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి.