చెన్నూర్, డిసెంబర్ 26 (టీ మీడియా): పట్టణంలో ని మహాంకాళివాడకు చెందిన వొడ్లాల భగవం తు(50) ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందాడు. పోలీస...
చెన్నూర్, డిసెంబర్ 26 (టీ మీడియా): పట్టణంలో ని మహాంకాళివాడకు చెందిన వొడ్లాల భగవం తు(50) ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. అదే వాడకు చెందిన తాండూరి భూదేవి తొమ్మిది రోజుల క్రితం మృతి చెందింది. ఆమెకు నదిలో కర్మకాండలు నిర్వహిస్తుండగా, వాటిలో పాల్గొనేందుకుగాను వొడ్లాల భగవంతు వెళ్లాడు. కర్మకాండ పూర్తయిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన భగవంతు గల్లంతయ్యాడు. మి గతా వారు ఆయన ఆచూకి కోసం వెతికారు. ఉద యం భగవంతు గల్లంతుకాగా మధ్యాహ్నం మృతదేహం లభించింది. భగవంతుకు కూతురు శారధ, కొడుకులు సంపత్, మల్లేశ్ ఉన్నారు. కేసు దర్యా ప్తు చేస్తున్నామని ఎస్ఐ రవీందర్ తెలిపారు.
ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్రగాయాలు
చైన్‌గేట్ (నిర్మల్): నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామం వద్ద ఆ టో బోల్తా పడిన ఘటనలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘ టనకు ముందుగా భైంసా నుంచి నిర్మల్ వైపు వ స్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో గాయాలపాలైన వారిని చూసేందుకు బం ధువులు ఆటోలో తరలివచ్చారు. ఆటోలో దా దాపు 12 మంది ప్రయాణికులున్నారు. చిట్యాల వద్ద ఆటోకు కోతి అడ్డుగా రావడంతో ఆటోను కం ట్రోల్ చేసే ప్రయత్నంలో బోల్తా పడింది. ఇందు లో ప్రయాణీస్తున్న వంశీ, దేవకి, రాజమణి, లక్ష్మి, సుశీల, వందన, వనితతో పాటు పలువురికి గా యాలయ్యాయి. దేవేందర్‌రెడ్డి గాయపడ్డ వారందరికీ వైద్య చికిత్స నిర్వహించారు.