-జిల్లాలో జోరుగా చెలామణి n గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం -వ్యవసాయ మార్కెట్లు, సంతల్లో వ్యాపారం? -ఎనిమిది రోజుల క్రితం రామకృష్ణాపూర్లో ముఠా ...
-జిల్లాలో జోరుగా చెలామణి n గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం
-వ్యవసాయ మార్కెట్లు, సంతల్లో వ్యాపారం?
-ఎనిమిది రోజుల క్రితం రామకృష్ణాపూర్లో ముఠా పట్టివేత
-రెండ్రోజుల క్రితం మంచిర్యాలలో ఒకరి అరెస్ట్
-4 లక్షల దొంగ నోట్ల స్వాధీనం
-సర్వత్రా కలకలం
(టీ మీడియా, మంచిర్యాల ప్రతినిధి): జిల్లాలో యథేచ్ఛగా నకిలీ నోట్ల చెలామణి కొన సాగుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమ ర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, చెన్నూరు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, నిర్మల్, భైంసా, ఆదిలాబా ద్, లక్సెట్టిపేట, దండేపల్లి తదితర ప్రాంతాల్లో అ క్రమార్కులు యథేచ్ఛగా నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఏది నకిలీనో.. ఏది అసలో పోల్చులేకపోతున్నారు. బ్యాం కుకు వెళ్తే సిబ్బందిని వాటిని తీసుకుని కాల్చివేయడమో, దానిపై నకిలీ అని ముద్ర వేయడమో జరుగుతోంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బయటి ప్రాంతాలను నకిలీ నోట్లను తీసుకువస్తున్న కొందరు జిల్లాలో చెలామణి చేస్తున్నా రు. జగిత్యాల, హైదరాబాద్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి వీటిని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు డబ్బులకు ఆశపడి స్థా నికంగా కంప్యూటర్, ప్రింటర్ కొనుక్కుని నోట్లను తయారు చేస్తున్నారు. -వ్యవసాయ మార్కెట్లు, సంతల్లో వ్యాపారం?
-ఎనిమిది రోజుల క్రితం రామకృష్ణాపూర్లో ముఠా పట్టివేత
-రెండ్రోజుల క్రితం మంచిర్యాలలో ఒకరి అరెస్ట్
-4 లక్షల దొంగ నోట్ల స్వాధీనం
-సర్వత్రా కలకలం
రూటు మార్చిన కేటుగాళ్లు
గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన నకి లీ నోట్ల చెలామణి ఇప్పుడు పల్లెలకు పాకింది. పట్టణాల్లో చాలా బ్రాందీషాపులు, షాపింగ్‌మా ల్స్, హోటళ్లలో నకిలీ నోట్లను గుర్తించే యంత్రాలను పెట్టుకున్నారు. దీంతో వీరంతా పల్లెల్లో నో ట్లను సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా సంతలు, పశువులను కొనుగోలు చేసే ప్రాంతాలను ఎన్నుకుంటున్నారు. ఇక్కడంతా అమాయక పల్లె జనం ఉంటారు కాబట్టి.. వీరి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా ముత్యంపేట, మ్యాదరిపేట, తాళ్లపేట, దొనబండ, తాండూరు మండలం ఐబీ, ఆసిఫాబాద్, కెరమెరి, తదితర ప్రాంతాల్లో జరిగే సంతల్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు తీసుకెళ్తున్న బాధితులు నకిలీ నోట్లని తేలుతుండడంతో లబోదిబోమంటున్నారు.
ఏటీఎంల్లోనూ
ఈ నకిలీ నోట్లు ఏటీఎంల్లో కూడా బయట పడుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. బ్యాంకు సిబ్బంది నోట్లను గుర్తించకుండానే వాటిని ఏటీఎంల్లో పెట్టేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా యి. కొన్ని సందర్భాల్లో అధికారులకు తెలిసి మరీ వాటిని ఏటీఎంల్లో పెడుతున్నారు. దీంతో ఎటుచేసి నష్టపోవడం వినియోగదారుల వంతు అవుతోంది. నకిలీ నోట్లను బ్యాంకులకు తీసుకెళ్తే దాని ని రిజెక్టు చేయడమో లేకపోతే కాల్చివేయడమో చేస్తున్నారు. అమాయక జనం తెలియక తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పోలీసుశాఖ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదో రకం మోసం
ఇదంతా ఒకెత్తు కాగా ఓ మోసగాడు చిన్న పిల్లలు ఆడుకున్న నోట్లను నిజమైన నోట్లుగా నమ్మించి అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేశాడు. కాగజ్‌నగర్‌కు చెందిన షేక్ జమాలుద్దీన్ అనే వ్యక్తి తను చేసే బిజినెస్‌లో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని హైదరాబాద్ నుంచి చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ నో ట్లను తీసుకువచ్చాడు. రూపాయికి నాలుగు చొ ప్పున కొనుక్కొచ్చాడు.
వంద, ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను నాలుగు లక్షల వరకు తీసుకువచ్చాడు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మంది నకిలీ నోట్ల వ్యవహారాన్ని ఎంచుకుంటున్నారు. పది వేల రూపాయలు ఇస్తే లక్ష రూపాయల విలువైన 1000 రూపాయల నకిలీ నోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సామాన్య జ నాన్ని బురిడి కొట్టిస్తున్న ముఠాల ఆగడాలను అరికట్టి సామాన్య జనానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు.
జిల్లాలో ఘటనలు
n గతంలో లక్షెట్టిపేటకు చెందిన ఐదుగురు కరీంగనర్‌లో నకిలీ నోట్లు తయారు చేసేవారు. జిల్లాలో లక్షెట్టిపేట, ముత్యంపేట, మ్యాదరిపేట, తాళ్లపేట, దొనబండ, సాయంత్రం పూట హోట ళ్లు, బేకరీల్లో, బాంద్రీషాపుల్లో చెలామణి చేసేవారు.
-ఐదు రూపాయల నకిలీ నాణాలు కూడా తయా రు చేసేవారు. జగిత్యాలలో వంద నోటు మారుస్తుండగా విషయం బయటకి పొక్కింది. ఈ ము ఠాలో కొందరు వ్యాపారస్తులకు ప్రమేయం ఉన్నట్లు తేలింది.
-తర్వాత ఎస్బీఐలో ఒకేరోజు ఒక ఖాతాదారుని వద్ద ఆరు, అరగంట తర్వాత మరో ఖాతాదారుని వద్ద 10 ఐదు వందల నోట్లు బయటికి రావడం కలకలం సృష్టించింది. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
-ఈ మధ్య కాలంలో లక్షెట్టిపేటలోని ఏటీఎంలలో కూడా నకిలీ నోట్లు వస్తున్నాయి. ఒక ప్రైవేట్ బ్యాంకులో ఒక ఖాతాదారుడికి నకిలీవి రూ. 500 నోటు రావడంతో సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. దీంతో తిరిగి అతనికి మంచినోటు ఇచ్చారు. ఈ విషయం బయటికి రాకుండా బ్యాంకు సిబ్బంది దాచిపెట్టారు.
-వారం కిందట కొందరు ముఠాగా ఏర్పడి రామకృష్ణాపూర్లో నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన పోలీసులు వా రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
-ఏడాది కిందట రైళ్లలో నకిలీ నోట్లు రవాణా చేస్తుండగా గుర్తించిన మంచిర్యాల పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
నకిలీ నోట్లను గుర్తించండిలా
-ఒక రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకు క్రమసంఖ్య ఒకే విధంగా ఉంటుంది. అక్షరాల్లో ఏమాత్రం తేడా ఉండదు. అదే నకిలీ నోట్లపై సంఖ్యలు పెద్దవిగా ఉంటాయి.
-ప్రతి నోటుపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)అనే అక్షరాలు చేతి వేళ్లతో ముట్టుకుంటే ఉబ్బుగా ఏర్పడుతాయి. నకిలీ నోట్లలో ఆ అక్షరాలు ఉబ్బుగా ఉండవు.
నోట్ల మధ్యలో ఆర్బీఐ సెక్యూరిటీ త్రెడ్ (దారం) బయటకు తీసినా రాదు. నకిలీ నోట్లకు మాత్రం సెక్యూరిటీ త్రెడ్ తీయవచ్చు.
-ఆర్బీఐ ముద్రించిన నోట్లలో తెల్లగా ఉన్న ప్రాంతంలో గాంధీ బొమ్మ కనిపిస్తుంది. కానీ నకిలీ నోట్లలో చిత్రం ఉండదు.
-నకిలీ నోట్లు తడిస్తే దానికి సంబంధించిన రంగు చేతికి అంటుకుంది.