-శరవేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు -అడుగంటుతున్న బోర్లు, బావులు -చలికాలంలోనే తాగునీటికి తిప్పలు -ఇలాగే ఉంటే మున్ముందు గడ్డు పరిస్థితులు (టీ...
-శరవేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
-అడుగంటుతున్న బోర్లు, బావులు
-చలికాలంలోనే తాగునీటికి తిప్పలు
-ఇలాగే ఉంటే మున్ముందు గడ్డు పరిస్థితులు
(టీ మీడియా, మంచిర్యాల ప్రతినిధి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగ ర్భ జలాలు రోజురోజుకు గణనీయంగా పడిపోతున్నాయి. చలికాలంలోనే ప్రధాన జలాశయాలు, కుంటలు, చెరువులు, బావులు అడుగంటుతున్నా యి. ఇప్పటికే పలుచోట్ల బావులు, బోర్లు వట్టిపోయాయి. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య లు వేధిస్తున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలాగే ఉంటే ఎం డాకాలంలో మరింత దారుణంగా ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తగి న ప్రణాళికలు రూపొందిస్తేనే, ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశముంది.
పడిపోతున్న భూగర్భ జలాలు
2012 మేలో సరాసరి భూగర్భ జలమట్టం 12.79 కాగా, నవంబర్‌లో 6.23 మీటర్లు. 2013 మేలో 10.06 మీటర్లు కాగా, నవంబర్‌లో నాలుగు మీటర్లు. అదే 2014 మేలో 8.02 మీట ర్లు, నవంబర్‌లో 6.28 మీటర్లు. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా, భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా ఉన్న నిల్వల విషయం తీసుకుంటే 2013 నవంబర్ నుంచి 2014 వరకు ఏ ఒక్క డివిజన్లో కూడా పరిస్థితి మెరుగ్గా లేదు. ఆదిలాబాద్ డివిజన్లో - 2.56 మీటర్లు, ఆసిఫాబాద్ డివిజన్లో - 3.26, మంచిర్యాల డివిజన్ లో - 1.84, నిర్మల్ డివిజన్లో - 4.26, ఉట్నూ రు డివిజన్లో -2.36 మీటర్లు లోటులో భూగర్భ జలాలున్నాయి. ఇలా ఉంటే వేసవిలో నీరందడం కష్టంగా మారుతుంది.
మండలాల్లోనూ ప్రమాదఘంటికలు
మండలాల వారీగ చూసుకున్నా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోలిస్తే అన్ని చోట్లా భూగర్భజలాలు పడిపోయాయి. తానూరు మండలంలో 13.59 మీటర్ల మట్టానికి జలాలు పడిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముథోల్ మండలం లో 8.01, బోథ్ మండలంలో 7.79, దిలావర్పూర్లో 6.47, తాండూర్‌లో 6.35, కాగజ్‌నగర్‌లో 6.02 మీటర్ల మేర జలాలు అడుగంటాయి. ముఖ్యంగా ఈ యేడాది వర్షాభావ పరిస్థితి నేప థ్యంలో ఈ దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు మినహా ఎప్పుడూ కూడా భారీ వ ర్షాలు కురువలేదు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం లోటు 35 మిల్లీమీటర్ల ఉంది. అందుకే భూగర్భ జలాల పరిస్థితి ప్రమాదకరంగా మారింది.
ఎండాకాలంలో తీవ్రం
గతేడాది భారీ వర్షాలు కురిసినా నీటి ఎద్దడి తప్పలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో దారుణమైన నీటి కొరత ఏర్పడింది. ఇప్పుడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుంది. దీంతో అధికారులు మే ల్కొని ఈ విషయంలో ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో నీటి సమస్య ఎదుర్కొన్న గ్రామాలు, తండాలపైన దృ ష్టి సారించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.