-ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రకటన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి నేటివరకు పార్టీ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని, భవిష...
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి నేటివరకు పార్టీ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని, భవిష్యత్తులోనూ అదే పంథా కొనసాగుతుందని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తనకు చీఫ్ విప్ పదవి ఇవ్వడంపై అలకబూనినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో టీ మీడియా కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడింది. కేసీఆర్ నాయ కత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తన పనితీరు సమర్థతతోపాటు అన్ని విషయాలు కేసీఆర్‌కు తెలుసునని ఆయన చెప్పారు.
2001 నుంచి కేసీఆర్‌తోనే ఉన్నానని అన్నింట్లోనూ కేసీఆర్ ఆదేశాల మేరకే నడుచుకొని లక్ష్యాలను సాధించుకున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ కేసీఆర్‌తోనే ఉంటూ, అధినేత ఆదేశానుసారమే కొనసాగుతానని చెప్పారు. చీఫ్ విప్ పదవిపై మీరు విముఖత చూపుతున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనా? అని ప్రశ్నించగా, ఆ విషయాలేవైనా ఉంటే అధినేత కేసీఆర్ వద్దనే వాటిని ప్రస్తావిస్తానని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం తాను ముఖ్యమంత్రిని కలువనున్నట్లు చెప్పారు.