భైంసా రూరల్, డిసెంబర్ 19 (టీ మీడియా): జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో జిల్లా వాసులు వణుకుతూ చలిమంటలను కాగుతున్నారు. ఈ క్రమ...
భైంసా రూరల్, డిసెంబర్ 19 (టీ మీడియా): జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో జిల్లా వాసులు వణుకుతూ చలిమంటలను కాగుతున్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందింది. భైంసా గ్రామీణ ఎస్ఐ గుణవంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. హజ్గుల్ గ్రామానికి చెందిన మహ్మద్బీ (80) గురువారం రాత్రి ఇం ట్లో చలికి మంట కాగుతోంది. గమనించకపోవడంతో చీరకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఆమెకు గా యాలయ్యాయి. గమనించిన కు టుంబ సభ్యులు ఆమెను, భైంసాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు.