జమ్మికుంట నగర పంచాయతీ సమీపంలోని ఓ మెడికల్ షాపులో కాలం చెల్లిన మందులు విక్రయించాడని ఓ వినియోగదారుడు మంగళవా రం ఆ షాపు ఎదుట బంధువులతో కలిసి...
జమ్మికుంట నగర పంచాయతీ సమీపంలోని ఓ మెడికల్ షాపులో కాలం చెల్లిన మందులు విక్రయించాడని ఓ వినియోగదారుడు మంగళవా రం ఆ షాపు ఎదుట బంధువులతో కలిసి ఆందో ళన చేశాడు. ఆబాది జమ్మికుంటకు చెందిన విని యోగదారుడు నరిగె రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర పంచాయతీ ఎదురుగా ఉన్న ఓ క్లినిక్‌కు తన భార్య రజితను తీసుకొచ్చాడు. ఈఎన్టీ డాక్టర్‌కు చూపించాడు. వైద్యుడు కొన్ని మందులు రాయగా, ఆ చిట్టీని తీసుకొని పక్కనే ఉన్న మెడికల్ షాపులోకి వెళ్లి తీసుకున్నాడు. మం దుల షాపు యజమాని రూ.500 తీసుకుని, కా లం చెల్లిన శాంపిల్ మందులు, ప్రభుత్వాసుపత్రికి సరఫరా చేసే మందులను ఇచ్చినట్లు గుర్తించి తన బంధువులతో కలిసి షాపు యజమానిని నిలదీశా డు. సదరు యజమాని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం, బెదిరింపులకు దిగడంతో జిల్లా వైద్యాధి కారికి, డ్రగ్ ఇన్స్పెక్టర్కు, పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.
ఉపాధి అక్రమార్కుడికి జైలు
(టీ మీడియా, కరీంనగర్)
ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన భీమదేవరపల్లి మండలం కట్కూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ ఏ సమ్మయ్యకు 6నెలల జైలుశిక్ష, రూ.80వేల జరిమానా విధించినట్లు కరీంనగర్-మెదక్ ప్రత్యేక మొబైల్ కోర్టు ప్రభుత్వ న్యాయ వాది కే వెంకటరాములు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై మంగళవారం కలెక్టరేట్ లోని డ్వామా కార్యాలయంలో మెదక్, కరీంనగర్ జిల్లా ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి కె వెంకటేశ్వర్ రావు విచారణ చేపట్టిన తుది తీర్పు ఇచ్చినట్లు చె ప్పారు. ఉపాధి హామీలో భాగంగా 2011లో క ట్కూర్‌లో రూ.8, 76, 493తో మూడు పాడు బడ్డ బావుల పూడ్చివేత పనులు చేపట్టారనీ, అప్ప టి సర్పంచ్ సమ్మయ్య ఈ పనుల్లో అవకతవకల కు పాల్పడ్డాడని వెల్లడించారు. గ్రామంలో నిర్వ హించిన సామాజిక తనిఖీలో రూ.1, 65, 300 నిధులు దుర్వినియోగమైనట్లు తెలిందన్నారు. రా ష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఫిర్యాదు మే రకు విచారించి తుది తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.
ఆపరేషన్ అర్బన్ హెల్త్!
ఇంతకాలం ప్రాథమిక వైద్య సేవలకే పరిమితమైన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో(అర్బన్ హెల్త్ సెంటర్లలో) పూర్తిస్థాయి సేవలు ప్రారంభించేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది. వీటి నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థల నుంచి తప్పించి, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్(ఎన్యూహెచ్ఎం) కింద మున్సిపాల్టీలకే అప్పగించాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 50వేల జనాభాకు ఒక సెంటర్, 2.5లక్షల జనాభాకు 30పడకల ఆసుపత్రిని నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అర్బన్‌హెల్త్ సెంటర్ల సంఖ్య పెరగనుంది.
2000లో 16 యూహెచ్‌సీలు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న నగరాల్లో ప్రాథమిక వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం 2000లో మొత్తం 16 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించింది. కరీంనగర్, జగిత్యాలలో మూడు చొప్పున, కోరుట్ల, మెట్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున, గోదావరిఖనిలో ఆరు, సిరిసిల్లలో రెండు సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటిని స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో నడిపిస్తూ వస్తోంది. ఒక్కో కేంద్రంలో ఓ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్ వాచ్మెన్, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించింది. వీటికి అవసరమయ్యే మందులను ప్రభుత్వమే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ఒక్కో కేంద్రం నిర్వహణ కోసం ప్రతినెలా రూ.66,700 కేటాయిస్తోంది. ఎన్జీఓలకు ఒక్కొక్కరికి ఒక్కోలా వేతనాలు చెల్లిస్తోంది. కొన్ని చోట్ల కనీస వైద్య సేవలు అందించడం లేదని, వీటి ప్రగతి తెలుసుకుంటూ లక్ష్యాలు సాధించని సెంటర్లను స్వాధీనం చేసుకొని, వాటి నిర్వహణను సమీప కేంద్రాలు, వైద్య ఆరోగ్యశాఖకు అప్పగిస్తోంది.
అందులో భాగంగానే మెట్పల్లి, గోదావరిఖనిలోని అల్లూరు, జగిత్యాలలో ఓ సెంటర్‌ను రద్దు చేసి, వాటి నిర్వహణను వైద్యశాఖకే అప్పగించింది. సెంటర్ల నిర్వహణ బాగు లేకపోవడంతో పాటు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరు, సిబ్బంది మధ్య గొడవలు సైతం తారాస్థాయికి చేరిన సంఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని సెంటర్లు మాత్రమే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నప్పటికీ ఎక్కువశాతం నిధుల దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని సెంటర్లలో వైద్యులు లేకున్నా వైద్యుల పేరిట సిబ్బంది పేరిట బిల్లులు సైతం డ్రా చేసిన సంఘటనలున్నాయి.
త్వరలో ఎన్యూహెచ్ఎం కింద..
ప్రస్తుతం అర్బన్ సెంటర్లు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్నాయి. తర్వలో వీటిని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్మిషన్(ఎన్యూహెచ్ఎం) కిందికి తీసుకురానున్నారు.
పట్టణాలు, నగరాల్లో పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రస్తుతం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) కింద పని చేస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్లను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్మిషన్(ఎన్యూహెచ్ఎం) కింద మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణ, నగరాల్లో కొంతమరకే అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్య సేవలు అందుతున్నాయని, ఇవి ఏ మూలకు సరిపోవడం లేదని భావించి కొత్త సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఇందులో భాగంగా 50వేల జనాభాకు ఒక సెంటర్‌ను కేటాయిస్తున్నారు.
దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అర్బన్‌హెల్త్ సెంటర్ల సంఖ్య పెరగనుంది. వీటితో పాటు 2.5లక్షల జనాభా ఉన్న నగరాల్లో 30పడకల ఆసుపత్రిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిలో 24గంటల పాటు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పెరగనున్న వైద్య సిబ్బంది..
ఇప్పటి వరకు సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉండి, ఓపీ మాత్రమే చూసే విధంగా ఉండేది. ఇకపై ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ప్రతి 10వేల జనాభాకో ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను ప్రభుత్వానికి పంపించారు. గతంలో ఉన్న మెడికల్ అసిస్టెంట్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పోస్టులు లేనట్లు తెలుస్తోంది.
ప్రసవాలూ ఇక్కడే..
ప్రతి సెంటర్లో పూర్తిస్థాయి వైద్యంతో పాటు ప్రసవాలు సైతం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జనాభా ఆధారంగా అర్బన్‌హెల్త్ సెంటర్లు మరిన్ని పెరిగి వైద్యులతో పాటు వైద్య సిబ్బంది పోస్టులు కూడా భారీగా పెరగనున్నాయి. వీటి నిర్వహణకు జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సెంటర్లకు త్వరలో సొంత భవనాలు రానున్నాయి. కేంద్రాల నిర్వహణపై గతంలో రాష్ట్ర వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమావేశం నిర్వహించారు. కావాల్సిన వసతులపై అధికారులు కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించారు. కాగా, కొత్త సంవత్సరంలో జిల్లాలో మరిన్ని అర్బన్‌హెల్త్ సెంటర్లను ప్రారంభించి తమకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
