తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు శుభవార్త. వారి జీతాలు పెంపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకె చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉ...
తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు శుభవార్త. వారి జీతాలు పెంపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకె చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ నెల 6న హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడు హోంగార్డులకు వేతనం నెలకు 9 వేలు ఉంది. దానిని రూ.12 వేలకు పెంచారు. దీంతో పాటు జంటనగరాల పరిధిలో ఉన్న వారికి బస్ పాస్, ఆరోగ్యభీమా, ఏడాదికి రెండు యూనిఫాంలు, పరేడ్ రూ.28 నుండి రూ.100కు పెంచారు. ఈ వేతనాలు ఏప్రిల్ నెల నుండి అమలులోకి వస్తాయి. పెంచిన వేతనాల మూలంగా రాష్ట్రంలోని 16 వేల మంది హోంగార్డులకు లబ్ది చేకూరుతుంది.