అమెరికా: అహింసా మార్గంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడించిన మ హనీయుడు! కోట్లాది మంది గుండెల్లో ఆయనో దైవం! మద్యపాన నిషేధం కోసం కడవరకు పోరుసాగి...
అమెరికా: అహింసా మార్గంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడించిన మ హనీయుడు! కోట్లాది మంది గుండెల్లో ఆయనో దైవం! మద్యపాన నిషేధం కోసం కడవరకు పోరుసాగించిన గాంధీని అమెరికాకు చెందిన ఓ మద్యం కంపెనీ చీటిమాటికి అవమాన పరుస్తూనే ఉంది. ఎన్నారైల నుంచి నిరసన వ్యక్తమైనప్పుడు కొద్దిగా సద్దుమణిగి మళ్లీ దుశ్చర్యలకు తెగబడుతూనే ఉంది. న్యూ ఇంగ్లాండ్ బెవరేజ్ కంపెనీ ఈ ఏడాది ఆరంభంలో కొన్ని ప్రత్యేక చిత్రాలతో బీరు టిన్నులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అందులో రోబో రూపంలో మహాత్ముడి చిత్రాలను టిన్నులపై ముద్రించింది. ఈ విషయం అప్పట్లో వివాదాస్పదమవడంతో కంపెనీ కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ అవే చిత్రాలతో మార్కెట్లోకి బీరు టిన్నులను విడుదల చేసింది. దీనిపై అమెరికాలోని ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.