కార్పొరేషన్, డిసెంబర్ 18, టీ మీడియా: నగరపాలక సంస్థ ఆడిట్ విభాగంలో పనిచేసే ఓ అధికారి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. నగరంలో ఇంజినీరింగ...
కార్పొరేషన్, డిసెంబర్ 18, టీ మీడియా: నగరపాలక సంస్థ ఆడిట్ విభాగంలో పనిచేసే ఓ అధికారి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. నగరంలో ఇంజినీరింగ్ అధికారులు ఇటీవల చేపట్టిన నల్లాల సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. మార్కండేయనగర్లో కొత్తగా నిర్మించిన ఇంటికి నల్లా కనెక్షన్ ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. నల్లాకు సంబంధించి పాస్బుక్ చూపించాలని ఇంట్లో నివసిస్తున్న వారిని అధికారులు కోరగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమ నల్లా కనెక్షన్గా గుర్తించినట్లు ఏఈ యాదగిరి తెలిపారు.
వివరాలు సేకరించగా ఆ ఇల్లు కార్యాలయానికి చెందిన ఆడిట్ అధికారిది అని తెలిసిందని, అయినా అక్రమంగా నల్లా కనెక్షన్ ఉండడంతో దానిని గురువారం తొలగించామని ఏఈ తెలిపారు. అయితే ఆ ఇంటికి ఇంటినంబర్ కూడా లేకుండానే నల్లా కనెక్షన్ తీసుకోవడం గమనార్హం. గతంలో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కొందరు ఉన్నతాధికారులు చెప్పడం వల్లే ఈ ఇంటికి కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి కావడంతో అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నా ఎవరు అడుగుతారనే దీమాతో తొమ్మిది నెలల కిత్రం ఈ నల్లా కనెక్షన్ తీసుకునట్లు తెలుస్తోంది. అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన ఎంతటి వారైనా సరే తొలగిస్తామని ఏఈ యాదగిరి తెలిపారు.