సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్తు న్నారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత...
సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్తు న్నారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్త సిస్టమ్ తీసుకురావడంపై సీఎంల అభిప్రాయాలను తీసుకోనున్నారు మోడీ. దీనికోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. కొత్త సిస్టమ్ కు పెట్టాల్సిన పేరు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు… ఐదేళ్ల పాటు ఆర్థికాభివృద్ధి ప్రణాళిక లాంటి అంశాలపై సీఎం అభిప్రాయాలు షేర్ చేసుకోబోతున్నారు పీఎం. కొత్త వ్యవస్థకు ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎంపిక కోసం ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై రిపోర్టులు అందివ్వబోతున్నారు కేసీఆర్. కేసీఆర్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని సమస్యలు.. రావాల్సిన గ్రాంట్లపై పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీ సర్కారు తీరుపై ప్రధానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.