సరిహద్దుల్లో బొక్కల దందా.. ( Oil being prepared by Animal bones )

-సరిహద్దు మండలాల గుండా ఎముకల సరఫరా.. -అక్రమార్కులకు అడ్డాగా మారిన అకోలా - సంగారెడ్డి రహదారి -సరిహద్దు అటవీ గ్రామాలే నిల్వకు కేంద్రాలు ...

-సరిహద్దు మండలాల గుండా ఎముకల సరఫరా..
-అక్రమార్కులకు అడ్డాగా మారిన అకోలా - సంగారెడ్డి రహదారి
-సరిహద్దు అటవీ గ్రామాలే నిల్వకు కేంద్రాలు
-నిన్న నర్సింగ్‌రావు పల్లి... నేడు రుసేగావ్....
-నూనె తయారీకే తరలింపు

బాన్సువాడ/మద్నూర్, డిసెంబర్ 21 (టీమీడియా) : సరిహద్దు మండలాలను అడ్డాగా చేసుకుని ఎముకల వ్యాపారం యథేచ్ఛ గా కొనసాగుతోంది. జంతు కళేబరాలను మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దులో ఉన్న జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో నిల్వ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో తమ వ్యా పారాన్ని సరిహద్దు మండలాల్లోని అటవీ ప్రాంతాలకు తరలించారు. 

జిల్లాలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో జోరుగా పశుమాంస విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆల్ కబీర్‌తో ఒప్పందాలు చేసుకుని పశు మాంసాన్ని టన్నుల కొద్ది నిత్యం హైదరాబాద్‌కు సరఫరా చేస్తూ వాటి ఎముకలను ఆరబెట్టేందుకు అటవీ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. గత నెలలో నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావు పల్లి చౌరస్తాలోని అటవీ ప్రాంతంలో గుట్టలు గుట్టలుగా నిల్వ చేసిన ఎముకల గురించి నమస్తే తెలంగాణ వెలుగులోకి తేవడంతో సంబంధిత అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని మరువక ముందే మద్నూర్ మండలం రుసేగావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా ఎముకలను ఆరబెట్టి ఉండటం సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు మండలాలుగా ఉన్న మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ పరిసర అటవీ ప్రాంతాల్లో కళేబరాలను ఎండబెడుతూ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు.

నూనె కోసమే ..
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ పరిసరాల్లోని రహస్య ప్రాం తాల్లో పశువుల ఎముకలతో నూనె తయారు చేసే కేంద్రాలు నిర్వహించడం, అధికారుల దాడులతో సంబంధిత వ్యక్తులు భయాందోళనకు గురై అక్కడి నుంచి తమ మకాంను జుక్కల్ నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాల్లోకి మార్చినట్లు తెలుస్తోంది. పశువుల ఎముకలతో నూనె తయారు చేసే తయా రీదారులు పలువురితో చేయి కలిపి కళేబరాలను బీదర్, నారాయణ ఖేడ్ తదితర ప్రాంతాల నుంచి నేరుగా డీసీఎంల సహాయంతో సంగారెడ్డి, హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. కళేబరాలు ఎవరికి కనబడకుండా, కుక్కల బారిన పడకుండా రేకుల షెడ్డును ఏర్పాటు చేస్తూ భద్రపరుస్తున్నారు. 

అక్రమ మార్గాల ద్వారా....
మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దులో ఉన్న జుక్కల్, మద్నూర్, ని జాంసాగర్, పిట్లం మండలాల్లోని అటవీ ప్రాంతాల పరిసరాల్లో ఉన్న రహస్య స్థావరాల్లో గుట్టలు గుట్టలుగా పశువుల ఎముకలను నిల్వ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎండిన ఎముకలను వ్యాన్ల ద్వారా కల్తీ నూనె తయారు చేసే వారికి సరఫరా చేస్తున్నారు. మంచినూనె పేరిట పశువుల కళేబరాలతో తయారు చేసిన కల్తీ నూనెను రహస్యంగా మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో కల్తీ నూనె తయారు చేస్తూ ఈ వ్యాపారులు అతి తక్కువ సమయంలోనే లక్షలకు పడగెత్తుతున్నారు. 

అటవీ ప్రాంతాల్లోకి వచ్చి పడుతున్న ఎముకలు.. 
మహారాష్ట్ర సమీపంలోని మద్నూర్ మండలం రుసేగావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పశువుల ఎముకలు, కళేబరాలు పోసి ఉంచడం బట్టి చూస్తే ఈ ప్రాం తా న్ని తమ వ్యాపారానికి ముఠా సభ్యులు అనుకూలంగా ఉన్న ట్లు గుర్తించి వ్యాపారం సాగిస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో ఎ న్నడూ లేని విధంగా ఇక్కడ రహస్యంగా రేకులతో చుట్టు కంచె వేసి వాటి నడుమ ఈ ప్రాంతంలో నుంచి సేకరిస్తున్న పశువుల కళేబరాలను నిల్వ చేస్తూ రహస్యంగా తరలిస్తున్నారు. 

హైదరాబాద్, మహారాష్ట్రకు తరలింపు....
గత నెలలో నర్సింగ్‌రావు పల్లి చౌరస్తా సమీపంలోని అటవీ ప్రాంతంలో కళేబరాల వ్యాపారాన్ని బహిర్గతం చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం బోధన్ మీదుగా మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి తరలిస్తున్నామని, ఇక్కడి నుంచి హైదరాబాద్ పరిసరాలకు తరలిస్తామని చెప్పడం బట్టి చూస్తే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు మండలాలకు ప్రధాన రహదారిగా మారిన అకోలా - సంగారెడ్డి మీదుగా ఈ ముఠా భారీగా పశువుల ఎముకలను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. 

అధికారుల అండతోనే ఈ అక్రమ వ్యాపారం....
సంగారెడ్డి - నాందేడ్ - అకోలా (ఎస్‌ఎన్‌ఎ) రహదారి గుండా అక్రమ ఎముకల వ్యాపారం కొనసాగిస్తున్నా ముఠాలోని సభ్యులకు ఈ ప్రాంతానికి చెందిన అధికారులు కొందరి అండ ఉన్నట్లు ఈ ప్రాంత వాసులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్‌రావు పల్లి శివారులో బహిర్గతమైన ఎముకల ముఠా విషయంపై లోతుగా విచారించి, ముఠా అక్రమ వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ ముఠా సభ్యు లు మరొక్క సారి మద్నూర్ మండలం రుసేగాం శివారులో స్థా వరాన్ని ఏర్పాటు చేసుకుని కుప్పలు కుప్పలుగా పశువుల ఎముకలను నిల్వ చేశారు. ఎముకల వ్యాపారం ముఠా సభ్యుల మాముళ్ల మత్తులో పడ్డ ఈ ప్రాంత సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టి పట్టనట్లు వ్యవహరించడంతోనే దర్జాగా ఈ ప్రాంతం వ్యాపారం యథేచ్ఛగా సాగుతుందని, దీన్ని నివారించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తే అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేదెవరని ఈ ప్రాంత వాసులు పలువురు ప్రశ్నిస్తున్నారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: సరిహద్దుల్లో బొక్కల దందా.. ( Oil being prepared by Animal bones )
సరిహద్దుల్లో బొక్కల దందా.. ( Oil being prepared by Animal bones )
http://weeklypulse.org/NewsImages/250359668.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2014/12/blog-post_89.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2014/12/blog-post_89.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy